అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత.. ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. చెన్నై అడయార్‌లోని దినకరన్ ఇంటి వద్ద ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ సమయంలో ఆయన ఇంట్లో ఉండటంతో ప్రమాదం తప్పింది..

అయితే కారు డ్రైవర్, వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గాయపడ్డారు. దినకరన్‌పై దాడి విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కార్యకర్తలు భారీగా దినకరన్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.