చెన్నై:తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వానికి  తాత్కాలికంగా ఊరట లభించింది.  18 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేల అనర్హత పై మద్రాస్ హైకోర్టు జడ్జిల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. 


ఈ కేసుకు సంబంధించిన బెంచ్ లో  ఇద్దరు జడ్జిల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.  చీఫ్ జస్టిస్  స్పీకర్ అభిప్రాయంతో ఏకీభవించారు. మరో జడ్జి దీనికి భిన్నంగా స్పందించారు.  దీంతో ఈ తీర్పు విషయంలో ఇద్దరుజడ్జిల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.


ఈ కేసును  విస్తృత ధర్మాసనానికి మార్చారు. ఈ నిర్ణయం తాత్కాలికంగా  పళనిస్వామి సర్కార్ ‌కు ఉపశమనం లభించింది.ఈ కేసును  విస్తృత ధర్మాసనానికి మార్చారు.ఈ కేసులో  చీఫ్ జస్టిస్ ఇందిర బెనర్జీ స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సుందర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో యధాతథస్థితి కొనసాగనుంది. అంతేకాదు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి మార్చనున్నారు.


దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా  స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది.

18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దుచేశారు. 

 అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా దినకనర్‌కు మద్దతు తెలుపడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు.  స్పీకర్‌ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. 

 ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 114మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరో 18మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా  పళని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వీరి అనర్హత వేటును ఉపసంహరిస్తే తిరిగి వీరు పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.