తమిళనాడు: అనర్హత వేటు పడిన 18 ఎమ్మెల్యేలపై మద్రాస్ హైకోర్టు తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి స్వాగతించారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు అనర్హులుగా హైకోర్టు తీర్పునివ్వడంతో పెద్ద గండం నుంచి తప్పించుకున్న పళని స్వామి ఇది ప్రజాస్వామ్య విజయమని స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మరో ఆరు నెలల్లో ఉపఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పళని స్వామి స్పష్టం చేశారు. అమ్మ ఆశీస్సులతో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని పళని స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరోవైపు మద్రాస్ హైకోర్టు తీర్పుపై అన్నాడీఎం కే పార్టీ కార్యాలయం వద్ద హంగామా నెలకొంది. పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణ సంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీదే విజయమంటూ ఆనందం వ్యక్తం చేశారు.