Asianet News TeluguAsianet News Telugu

పళినిస్వామికి కోర్టు షాక్: సీబీఐ విచారణకు ఆదేశం

తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై  సీబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు  శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

Madras HC orders CBI probe into corruption allegations against Tamilandu CM
Author
Chennai, First Published Oct 12, 2018, 3:47 PM IST

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై  సీబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు  శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

మూడు రోజుల క్రితమే  తమిళనాడు సీఎం  పళనిస్వామికి విజిలెన్స్ డైరెక్టర్, అవినీతి నిరోధక శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది.  ఈ క్లీన్ చిట్ ఇచ్చిన  మూడు రోజులకే  మద్రాసు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

తమిళనాడు సీఎం పళనిస్వామిపై అవినీతి ఆరోపణలపై డీఎంకె నేతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం నాడు మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  మద్రాస్ హైకోర్టు జడ్జి ఎ.డి. జగదీష్ చంద్ర ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం నాడు  ఆాదేశాలు జారీ చేశారు.  

పళనిస్వామి రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణానికి  కాంట్రాక్టులపై  సీబీఐ  విచారణకు ఆదేశించింది.ఈ విషయమై డీఎంకె నేతలు కోర్టును ఆశ్రయించారు. వేలాది కోట్ల రూపాయాల విలువైన కాంట్రాక్టులను   తన బంధువులు, స్నేహితులకు  సీఎం పళనిస్వామి కట్టబెట్టినట్టు  ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణలపై  డీఎంకె నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో   సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios