శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త, భూమాతా బ్రిగేడ్ చీఫ్ తృప్తిదేశాయ్ కేరళలో అడుగుపెట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పుణే నుంచి విమానంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తృఫ్తి బృందాన్ని డొమెస్టిక్ టెర్మినల్ గేట్ వెలుపల పెద్దసంఖ్యలో నిరసనకారులు అడ్డుకున్నారు.. దీంతో పోలీసులు తృప్తి బృందాన్ని విమానాశ్రయంలోనే నిలిపివేశారు.

మరోవైపు ఆందోళనకారులకు మద్ధతు తెలిపిన క్యాబ్ డ్రైవర్లు.. తృప్తి దేశాయ్‌ని.. ఆమె బృందాన్ని విమానాశ్రయం నుంచి బయటికి తీసుకెళ్లేది లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు తాను శబరిమలను దర్శించుకోనున్నామని... తమ బృందాన్ని హతమారుస్తామని... దాడులు చేస్తామని పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని తృప్తి దేశాయ్ కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సీఎం పినరయి విజయన్, డీజీపీలకు ఈ మేరకు లేఖ రాశారు. ఆమె రాకను తెలుసుకున్న హిందూ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు తృప్తిని అడ్డుకుంటున్నాయి. అయితే తాను అయ్యప్ప దర్శనం అయ్యాకే తిరిగి వెళతానని తృప్తి దేశాయ్ తేల్చిచెబుతుండటం... అడ్డుకునేందుకు నిరసనకారులు రెడీ అవ్వటంతో కొచ్చి విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

దీంతో ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిని బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులతో పాటు సాంప్రదాయవాదులు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

శబరిమల ఆలయ రహస్యం: అయ్యప్ప ఎవరి పుత్రుడు, గుడి ఎవరిది...

శబరిమలలో ఉద్రిక్తతలకు మెట్టుగూడ అయ్యప్ప గుడికి లింకేంటీ?

శబరిమలలో హై టెన్షన్: ఆలయంలో లోపల మహిళా పోలీసులు

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల తీర్పుకి మద్దతు పలికిన స్వామీజీ... ఆశ్రమానికి నిప్పు

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం