హైదరాబాద్: సికింద్రాబాద్‌కు సమీపంలోని మెట్టుగూడలోని అయ్యప్ప దేవాలయంలో వాస్తు దోషం శబరిమలలోని అయ్యప్ప టెంపుల్‌పై  ప్రతిబింబిస్తోందని ప్రచారం సాగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ  సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం.. మహిళల ప్రవేశాన్ని సంప్రదాయవాదులు అడ్డుకోవడం కూడ దీని ప్రభావమేననే ప్రచారం కూడ సాగుతోంది. 

అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆలయ కమిటీ ప్రకటించింది. తమ దేవాలయంలో వాస్తు దోషాలను  సరిచేసినట్టు ప్రకటించారు.  వాస్తు దోష నివారణ పూజలు చేయాలని 8 మాసాల క్రితమే నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆలయ కమిటీ పెద్దలు గుర్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్‌కు సమీపంలోని  మెట్టుగూడ అయ్యప్ప దేవాలయంలో వాస్తు దోషం  ఉంది.  ఈ ఆలయాన్ని 1986లో  నిర్మించారు.ఆలయం నిర్మాణం సమయంలో నైరుతి  దిశలో ఉండాల్సిన నాగమూర్తుల విగ్రహలను  వాయువ్య దిశలో ప్రతిష్టించారు. 

 దీంతో ఆలయానికి  అరిష్టమని భావించారు. శబరిమల ప్రధాన అర్చకుడు నీలకంఠ నేతృత్వంలోనే ఈ ఆలయంలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శబరిమల దేవాలయంలో సంప్రదాయాలను ఈ ఆలయంలో కూడ తప్పకుండా పాటిస్తారు.

అయితే నాగమూర్తుల విగ్రహలను  సరైన ప్రదేశంలో ప్రతిష్టించలేని విషయాన్ని ఎట్టకేలకు గుర్తించారు.  ఈ విషయమై   నాగమూర్తుల విగ్రహలను సరైన ప్రదేశంలో పున:ప్రతిష్టించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఎనిమిది మాసాల క్రితం మెట్టుగూడ ఆలయంలో వాస్తు దోషాన్ని సరిచేసే పూజలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. 

ఈ ప్లాన్‌లో భాగంగా  అక్టోబర్ 26,27,28 తేదీల్లో వాస్తు పూజలు నిర్వహించారు.  శబరిమల అయ్యప్పదేవాలయంలో పనిచేసే అర్చకులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

 వాయువ్య దిశలో  ఉన్న నాగ మూర్తుల విగ్రహలను నైరుతి దిశలో ప్రతిష్టించారు.  అయితే ఇంతకాలం పాటు సరైన ప్రదేశంలో నాగమూర్తుల విగ్రహలు లేనందున శబరిమల అలయంపై దీని ప్రభావం కన్పించిందనే పుకారు  ప్రచారంలోకి వచ్చింది.

మెట్టుగూడ ఆలయానికి శబరిమల ఆలయం సుమారు 1200 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ పుకారులో వాస్తవం లేదని  ఆలయ కమిటీ తేల్చి చెప్పింది.ఈ ప్రచారాన్ని నమ్మొద్దని  ఆలయ కమిటీ కోరుతోంది. తమ దేవాలయంలో వాస్తు దోషాన్ని సరిచేసే పూజలు మాత్రం నిర్వహించినట్టు ఆలయ కమిటీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

శబరిమలలో హై టెన్షన్: ఆలయంలో లోపల మహిళా పోలీసులు

శబరిమల: తెరుచుకొన్న అయ్యప్ప ఆలయం, భారీ బందోబస్తు

శబరిమల హోటళ్లలో మహిళలు.. గవర్నర్‌కు ఎమ్మెల్యే లేఖ

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం