బ్యాంకులు ఏ రోజుల్లో మూసివేయబడుతుందో మీరు   ముందుగా తెలుసుకోవాలి. అయితే మే నెలలో 14 రోజుల పాటు భారతదేశంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. 

బ్యాంకులకు వెళ్లి మనీ ట్రాన్సక్క్షన్స్, డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేసే వారు బ్యాంకు హాలిడేస్ గురించి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే సమయానికి పూర్తి చేయాల్సిన ఆర్థిక లావాదేవీలను బ్యాంకు సెలవు రోజున చేయాలని అనుకుంటే పొరపాటే. కాబట్టి బ్యాంకు ఏ రోజుల్లో మూసివేయబడుతుందో మీరు ముందుగా తెలుసుకోవాలి. అయితే మే నెలలో 14 రోజుల పాటు భారతదేశంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే అన్ని ఆదివారాలలో సెలవులు అండ్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్‌లో లిస్ట్ చేయబడిన తొమ్మిది సెలవులు ఉన్నాయి. అంతేకాదు రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారవచ్చు

మే 2024 బ్యాంక్ హాలిడేస్ లిస్ట్

మే 1 (బుధవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, కేరళలో మహారాష్ట్ర దినోత్సవం/మే డే (కార్మిక దినోత్సవం) నాడు బ్యాంకులకు మూసివేయబడతాయి.

మే 5 (ఆదివారం) బ్యాంకుకు సన్ డే హాలిడే(week off) 

మే 7 (మంగళవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి.

మే 8 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.

మే 10 (శుక్రవారం): బసవ జయంతి/అక్షయ తృతీయ నాడు కర్ణాటకలో బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 11 (రెండవ శనివారం) బ్యాంక్ సెలవుదినం 

మే 12 (ఆదివారం) బ్యాంకుకు సెలవు (week off) 

మే 13 (సోమవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి.

మే 16 (గురువారం): రాష్ట్ర దినోత్సవం సందర్భంగా సిక్కింలో బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 19 (ఆదివారం) బ్యాంకుకు సెలవు(week off)

మే 20 (సోమవారం): 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా మహారాష్ట్రలో బ్యాంకులు మూతపడనున్నాయి.

మే 23 (గురువారం): త్రిపుర, మిజోరం, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో బ్యాంకులు బుద్ధ పూర్ణిమ సందర్బంగా మూసివేసిఉంటాయి.

మే 25 (శనివారం): నజ్రుల్ జయంతి ఇంకా లోక్‌సభ సాధారణ ఎన్నికల కారణంగా త్రిపుర, ఒడిశాలో బ్యాంకులు మూసివేయబడతాయి.

మే 26 (ఆదివారం) బ్యాంకుకు సెలవు(week off)