ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ పార్టీలన్నీ.. మ్యానిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించగా.. టీడీపీ కూటమి మంగళవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన,బీజేపీ ప్రతిపాదనలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.  ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏఏ హామీలు ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 

మ్యానిఫెస్టోలో ముఖ్య అంశాలివే..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఏడాదికి రూ.18 వేలు అందజేత.

నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగభృతి.

 ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ కల్పన.  

ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.

మెగా డీఎస్సీపై తొలి సంతకం

'తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.

దివ్యాంగుల పెన్షన్ రూ.6000

వృద్ధాప్య పెన్షన్ రూ.4000

బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ , 

బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం.

ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌

వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000

ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ 

పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.

ఇసుక ఉచితం.

భూ హక్కు చట్టం రద్దు.

సముద్ర వేట విరామ సమయంలో మత్స్యాకారులకు రూ.20వేల సాయం.

బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.

చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.

చేనేతకు 200 యూనిట్లు