Asianet News TeluguAsianet News Telugu

ఇన్ స్టా రీల్స్ చేయద్దన్నందుకు.. సోదరుడి గొంతుకోసి హత్యాయత్నం, యువతి అరెస్ట్...

ఇన్ స్టా గ్రాం రీల్స్ కు బాగా అలవాటుపడ్డ ఓ యువతి.. అవి చేయద్దన్నందుకు సోదరుడిని గొంతుకోసి చంపే ప్రయత్నం చేసింది. 

Stopped from making reels girl tries to kill brother in Uttar Pradesh, sent to jail
Author
First Published Sep 20, 2022, 10:07 AM IST

కాన్పూర్ : ఫరూఖాబాద్‌లోని అస్తబల్ తరాయ్ ప్రాంతంలో ఉంటున్న 24 ఏళ్ల ఓ యువతి ఆదివారం తన ఇద్దరు తమ్ముళ్లపై దారుణంగా దాడి చేసింది. ఆమెను రీల్స్ చేయకుండా అడ్డుకుంటున్నారని వారిపై ఈ దారుణానికి తెగబడింది. ఇద్దరు సోదరుల్లో ఒకరి గొంతు కోసి చంపడానికి కూడా ప్రయత్నించింది. ఈ మేరకు అబ్బాయిల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సోమవారం యువతిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఆదివారం తెల్లవారుజామున, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని మౌదర్వాజ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పుడు కూడా ఆమె అలాగే ప్రవర్తించింది. అక్కడున్న నలుగురు మహిళా కానిస్టేబుళ్ల మీద అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారి యూనిఫామ్‌ను కూడా చింపేసింది. స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌తోనూ బాలిక దురుసుగా ప్రవర్తించింది.

ఆదివారం ఆకాష్ రాజ్‌పుత్ అనే బాలుడు.. తన అన్న జైకిషన్ రాజ్‌పుత్‌తో కలిసి మౌ దర్వాజా పోలీస్ స్టేషన్‌లో తన సోదరి ఆర్తి మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో తన అక్క ఆర్తి తన గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. వీరి సోదరి ఆర్తికి ఇన్ స్టా గ్రాం రీల్స్ చేయడం అలవాటు. అది ఆమెకు వ్యసనంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఆమె చేసే రీల్స్ మరీ సిల్లీగా ఉంటున్నాయి. దీంతో ఆకాష్ స్నేహితులు వెక్కిరించడం మొదలు పెట్టారు. 

ఇదేం కోడల్రా బాబోయ్.. అత్తామామల నగ్న వీడియోలు తీసి, భర్తకు బెదిరింపులు..

ఆకాష్ ను అతని అక్కను ఎగతాళి చేస్తూ మాట్లాడడం ప్రారంభించారు. దీంతో అక్కతో రీల్స్ చేయించడం ఆపించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రీల్స్ చేస్తుంటే అడ్డుకున్నాడు. దీంతో కోపానికి వచ్చిన ఆర్తి అతని మీద విచక్షణా రహితంగా దాడి చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన అతని సోదరుడు జైకిషన్ అతనిని రక్షించడానికి వచ్చాడు. ఆమె అతనిని కూడా వదిలిపెట్టలేదు. దాడి చేసింది. తమ తండ్రి బాదం సింగ్‌తో కూడా సోదరి ప్రవర్తపై చాలాసార్లు చెప్పానని ఆకాష్ చెప్పాడు.

ఫిర్యాదు అందుకున్న స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ అమద్‌ కుమార్‌ సింగ్‌ ఆర్తిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడానికి మహిళా కానిస్టేబుల్‌, హోంగార్డును పంపారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ఆర్తీ హైవోల్టేజీ డ్రామా సృష్టించింది. అక్కడున్న తన సోదరుడు ఆకాష్‌ను చూడగానే మరోసారి దాడి చేసింది. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించగా, ఆమె వారిపై కూడా దాడి చేసింది. దీంతో ఆర్తిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ అమద్ కుమార్ సింగ్ తెలిపారు. "సెక్షన్ 307 కింద ఒకటి (హత్యాయత్నం), రెండవది మహిళా కానిస్టేబుల్‌ను కొట్టడం, వారి యూనిఫాం చింపడం, ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించడం. ఆదివారం కేసు నమోదు చేసిన తర్వాత, ఆర్తీని అరెస్టు చేసి సోమవారం జైలుకు పంపాం" అని సింగ్ తెలిపారు.

ఆర్తి యాప్‌కు బానిస కావడం వల్లే తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందని.. ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారని ఆయన అన్నారు. "ఆమె యాప్‌ వాడకంలో పరిమితులు దాటిపోవడంతో ఆమె సోదరులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనికోసం ఆమెతో మాట్లాడారు కూడా.. కానీ ఆర్తి యాప్‌ను విడిచిపెట్టడానికి నిరాకరించిందని, ఈ క్రమంలోనే ఆదివారం, ఆమె తన సోదరుడిని చంపడానికి ప్రయత్నించిందని.." ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios