శబరిమల ఆలయంలో ప్రవేశించి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పను దర్శించుకున్న మహిళలుగా నిలిచిన కనకదుర్గ, బిందు అమ్మినిలు ఇంత వరకు ఇంటికి చేరుకోకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.

జనవరి 2 బుధవారం తెల్లవారుజామున 3.45 ప్రాంతంలో 50 ఏళ్లలోపు వయసున్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు భారీ భద్రత నడుమ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకున్నారు.

నల్లటి దుస్తులు ధరించి మాలలో ఉన్న భక్తుల్లాగా వారు దర్శనానికి వెళ్లారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో అపచారం జరిగిందని పూజారులు ఆలయాన్ని మూసివేసి, సంప్రోక్షణ నిర్వహించారు.

ఆ రోజు నుంచి నేటి వరకు కేరళ భగ్గుమంటోంది. ఆందోళనకారుల నుంచి హెచ్చరికలు వస్తుండటతో బిందు, కనకదుర్గలు అజ్ఞాతంలో గడుపుతున్నారు. కేరళలోని కన్నూర్ విశ్వవిద్యాలయంలో బిందు లా లెక్చరర్‌గా పనిచేస్తుండగా, కనకదుర్గ సివిల్ ఉద్యోగి. ‘‘తమను చాలా మంది నిరుత్సాహపరిచాలని చూశారని, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు, స్నేహితులు వెనక్కి తగ్గమని సూచించారని కనకదుర్గ తెలిపింది.

ఆందోళనను నిలువరించి, శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం చేతిలో ఉందని కొచ్చిలోని ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ వారు ఈ విషయాలను వెల్లడించారు. నిరసనకారుల నుంచి ఇంకా బెదిరింపులు వస్తుండటంతో వారిని అధికారులు, పోలీసులు ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచినట్లు తెలుస్తోంది. వచ్చే వారం బిందు, కనకదుర్గలను క్షేమంగా ఇంటి దగ్గర దిగబెడతామని పోలీసులు తెలిపారు.

 

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమల... జుట్టుకి తెల్లరంగు వేసుకొని స్వామి దర్శనం

శబరిమల ఆలయంలోకి ఇద్దరు కాదు...ఎనిమిది మంది మహిళలు: కేరళ పోలీసులు

శబరిమల వివాదం..మోదీ కేరళ పర్యటన వాయిదా

శబరిమల వివాదం.. ఎంపీలకు సోనియా వార్నింగ్

శబరిమలలోకి మహిళల ఆలయ ప్రవేశం.. సగం మీసంతో ఆందోళన

శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్న మరో మహిళ.. ఉద్రిక్తత