Asianet News TeluguAsianet News Telugu

శబరిమల ఆలయంలోకి ఇద్దరు కాదు...ఎనిమిది మంది మహిళలు: కేరళ పోలీసులు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం దేశ  వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే శబరిమల ఆలయంలోకి మహిళలను పంపించారంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు.  కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని హిందూ సాంప్రదాయాలను నాశనం చేయడానికే ఇద్దరు మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. 

kerala policie another announcement on shabarimala issue
Author
Kerala, First Published Jan 5, 2019, 2:06 PM IST

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం దేశ  వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే శబరిమల ఆలయంలోకి మహిళలను పంపించారంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు.  కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని హిందూ సాంప్రదాయాలను నాశనం చేయడానికే ఇద్దరు మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయంపై  దేశ  వ్యాప్తంగా అలజడులు జరుగుతున్న సమయంలో కేరళ పోలీసులు మరో సంచలన ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి 8 మంది మహిళలు ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారని తెలిపారు. పోలీసుల ప్రకటనతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. 

అయితే కేరళ పోలీసుల చేత ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని శబరిమల కర్మ సమితి ఆరోపిస్తోంది. శబరిమల ఆలయంలోకి మరింత మంది మహిళలను తరలించి ఈ దేవాలయ పవిత్రతను, హిందూ ఆచారాలను దెబ్బతీయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేస్తోందని ఈ సంస్థ తెలిపింది. 

శబరిమల ఆలయంలోకి కనకదుర్గ, బిందు అమ్మిని అనే ఇద్దరు మహిళలు రహస్యంగా గుడిలోకి ప్రవేశించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దీంతో కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ సమయంలో పోలీసుల ప్రకటన సంచలనంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios