Asianet News TeluguAsianet News Telugu

శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

శబరిమల ప్రధాన అర్చకుడికి చుక్కెదురైంది. శబరిమల అర్చకుడిపై సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

Sabarimala row: Contempt petitions against head priest for conducting purification rituals
Author
Hyderabad, First Published Jan 3, 2019, 10:28 AM IST

శబరిమల ప్రధాన అర్చకుడికి చుక్కెదురైంది. శబరిమల అర్చకుడిపై సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాన్ని శుద్ధి చేశారన్న కారణంతో అర్చకుడిపై ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. 

కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్న సంగతి తెలిసిందే. అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. తొలిసారిగా అయ్యప్పను ఇద్దరు మహిళలు దర్శించుకున్నారు. కాగా.. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో.. అపవిత్రమైందంటూ.. ప్రధాన అర్చకుడి ఆదేశాల మేరకు ఆలయ సంప్రోక్షణ చేశారు.

రెండు గంటల పాటు ఆలయాన్ని మూసివేసి మరీ.. శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆలయాన్ని శుద్ధి చేశారంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారంటూ బీజేపీ కేరళలో బంద్ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులు అడ్డుకున్నారు.

మరోవైపు పందలంలోని సీపీఎం కార్యాలయంపై పలువురు నిరసనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. బస్సులపై దాడి చేయడంతో 60కి పైగా బస్సులు ధ్వంసమయ్యాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

read more news

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

అయ్యప్పని దర్శించుకున్న మహిళ.. పరారీలో భర్త

Follow Us:
Download App:
  • android
  • ios