Asianet News TeluguAsianet News Telugu

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమల ఆలయాన్ని పూజారులు మరోసారి మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 40ఏళ్లలోపు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశంచిన సంగతి తెలిసిందే.

Sabarimala shrine shut for purification rituals after two women of menstruating age enter temple
Author
Hyderabad, First Published Jan 2, 2019, 11:07 AM IST

శబరిమల ఆలయాన్ని పూజారులు మరోసారి మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 40ఏళ్లలోపు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశంచిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. తొలిసారి ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

ఈ ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు పోలీసులు రక్షణగా నిలిచారు. కాగా.. దీనిపై పోలీసులపై భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మహిళల ప్రవేశంతో ఆలయ అపవిత్రం అయ్యిందంటూ.. ఆలయాన్ని పూజారులు మూసివేశారు. సంప్రోక్షణ( ఆలయం శుద్ధి చేయడం) తర్వాత తిరిగి ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. 

సంబంధిత వార్తలు..

శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios