శబరిమల అయ్యప్పను మరో మహిళ దర్శించుకుంది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల శశికళ అనే మహిళ నిన్న రాత్రి తన భర్తతో పాటు శబరిమల ఆలయానికి చేరుకుంది. అక్కడ పవిత్రమైన 18 మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకోవడంతో అక్కడ మరోసారి కలకలం రేగింది.

కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు స్వామి వారి దర్శనాన్ని చేయించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇద్దరు మహిళలు ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్న వ్యవహారంతో కేరళ రణరంగంగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు, కేరళకు చెందిన కొన్ని ప్రజా సంఘాలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, రాళ్లదాడులకు సైతం దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అధికార సీపీఎం కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు.

పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో నిరసనకారులు ఘర్షణకు దిగడంతో చాలా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు.

శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తుల్లాగే అయ్యప్పను దర్శించుకున్నారని చెప్పారు. అలాగే మహిళల దర్శనం తర్వాత పూజారులు ఆలయాన్ని శుద్ధిచేయడాన్ని సీఎం తప్పుబట్టారు. 
 

శబరిమలలోకి మహిళల ఆలయ ప్రవేశం.. సగం మీసంతో ఆందోళన

శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత