దారుణం: కూతురిపై రేప్, భార్యను కోర్టులోనే హత్య చేసిన భర్త

Rape-accused father kills wife in court in Assam
Highlights

కన్న తండ్రి కర్కశత్వం


గువహటి: కోర్టు ఆవరణలోనే  భార్యను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మాట్లాడుతున్నట్టుగానే నటించి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన  అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకొంది.

అస్సాం రాష్ట్రానికి చెందిన   పూర్ణ సహర్‌ డేకా అనే వ్యక్తి  తన కూతురిపై  అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయమై బాధితురాలిని బెదిరించాడు.  ఈ బెదిరింపులకు భయపడిన బాధితురాలు కొంత కాలం వరకు ఈ విషయాన్ని తల్లికి చెప్పలేదు. అయితే  ఈ వేధింపులు ఎక్కువ కావడంతో  విషయాన్ని తల్లికి చెప్పింది. 

దీంతో భర్తపై  భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  పూర్ణ సహర్ డేకాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం  అతను  జైలులో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు.  9 మాసాల తర్వాత బెయిల్ పై వచ్చిన  పూర్ణ సహర్ డేకా  ఇదే కేసు విషయమై కోర్టుకు హజరయ్యాడు.

ఈ కేసు విషయమై  కోర్టుకు  భార్య కూడ హజరైంది. అయితే భార్యతో మాట్లాడుతున్నట్టుగా నటించిన పూర్ణ  తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెను దారుణంగా పొడిచేశాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు బాధితురాలిని  ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే అక్కసుతో భార్యను కోర్టు ఆవరణలోనే పూర్ణ సహర్ డేకా కత్తితో చంపివేశాడు. ఈ కేసులో నిందితుడు  తొమ్మిది నెలలపాటు  జైలులో ఉన్నాడనీ, కొన్ని రోజుల క్రితం  బెయిల్‌పై  విడుదలయ్యాడరి డిబ్రూగఢ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ సిధేశ్వర్ బోరాహ్  చెప్పారు.

loader