రిజినీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆయన సినిమా వచ్చిందంటే  చాలు.. అభిమానులకు పండగే. ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూడాల్సిందే అని  ఫిక్స్ అయిపోతారు. మరి అందరికీ ఫస్ట్ టికెట్లు దొరకవు కదా. ఒక వేళ దొరికినా.. చాలా మందికి ఆఫీసుల్లో సెలవు దొరకాలి. అలా అని అభిమాన హీరో సినిమా వదులుకోలేరు. మరి ఎలా..? ఇలా బాధపడుతున్న ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఫ్రకటించింది.

కోయంబత్తూరులోని  గెట్‌ సెట్‌ గో అనే సంస్థ తన ఉద్యోగులకు  2.ఓ మూవీ విడుదల సందర్భంగా నవంబరు 29న అధికారిక సెలవు దినంగా ప‍్రకటించేసింది. ‘‘పనినుంచి  మీకు ఊరట. 2.0 మోడ్ ఆన్..ఛలో థియేటర్స్‌’’ అంటూ ఉద్యోగులకు ఒక లేఖ రాసింది. అంతేకాదు..ఈ మూవీకి వెళ్లాలనుకునేవారికి మొదటి రోజు టికెట్లను కూడా  ఉచితంగా అందిస్తామంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  ఇంకేముంది.. ఉద్యోగాలు ఆనందంతో తమ బాస్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. థియేటర్ వైపు అడుగులు వేశారు. 

read more news

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?