ఉద్యోగం  ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి.. విదేశీ మహిళలను ముంబయి నగరానికి రప్పిచారు. అనంతరం వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కల్యాణ్ రైల్వేస్టేషను ఫ్లాట్ ఫాం నంబరు 1పై ఒంటరిగా ఉన్న ఓ మహిళను రహీం రఫీక్ షేక్ వేధిస్తుండగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అతన్ని పట్టుకున్నారు. ఉద్యోగమిస్తానని చెప్పి రహీం రఫీక్ బంగ్లాదేశ్ నుంచి ఓ మహిళను ముంబయికు తీసుకువచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఆ మహిళను వ్యభిచారం చేయమని రహీం ఒత్తిడి తీసుకువస్తున్నాడని వెల్లడైంది. రహీం అరెస్టు చేసి విచారించగా ఉల్లాస్ నగర్, గ్రాంట్ రోడ్డుపై వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. విదేశాలతో పాటు మన దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.