భోపాల్: ఉత్తరప్రదేశ్ లో ఓ వైపు అత్యాచార ఘటనలు జరుగుతుండగానే మధ్యప్రదేశ్ లో ఓ దారుణమైన సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గావ్  జిల్లాలో ఓ మైనర్ బాలికను ముగ్గురు దుండగులు ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 

మంగళవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు మరుగఢ్ లోని తమ ఇంటికి వచ్చి మంచినీళ్లు అడిగి, తన సోదరుని ఎత్తుకెళ్లారని బాధితురాలి సోదరుడు చెప్పాడు. నిందితులు బాలిక సోదరుడ్ని పక్కకు నెట్టేసి, బాలికను ఎత్తుకెళ్లారని పోలీసులు చెప్పారు. 

Also Read: యూపీలో ఆగని రేప్ లు: బులంద్ షహర్ లో 14 ఏళ్ల బాలికపై, ఆజంఘర్ లో 8 ఏళ్ల బాలికపై..

పొలాల్లో బాలికపై అత్యాచారం చేశారు. ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. సహాయం కోసం బాలిక సోదరుడు ప్రజలను పోగు చేసి నిందితులను వెంటాడానికి ప్రయత్నించాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చదర్యలు చేపట్టారు. 

యుపిలో హత్రాస్ ఘటనతో దేశప్రజలు దిగ్భ్రాంతికి గురైన స్థితిలో మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. రెండు వారాల క్రితం యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

Also Read: యుపీలో మరో హత్రాస్ ఘటన: యువతిపై గ్యాంగ్ రేప్, గాయాలతో మృతి