Asianet News TeluguAsianet News Telugu

యుపీలో మరో హత్రాస్ ఘటన: యువతిపై గ్యాంగ్ రేప్, గాయాలతో మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ ఘటన పునరావృతమైంది. హత్రాస్ సామూహిక అత్యాచారానికి గురై, మరణించిన దళిత యువతిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే బలరాంపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Another Hathras: 22 year old drugged, gang raped in UP, dies of injurues KPR
Author
Balrampur, First Published Oct 1, 2020, 7:31 AM IST

లక్నో: హత్రాస్ ఘటనపై తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్న సమయంలోనే అటువంటి సంఘటనే మరోటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 22 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. తీవ్రమైన గాయాలతో ఆ యువతి మరణించింది. హత్రాస్ కు ఈ సంఘటన జరిగిన ప్రాంతం 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

హత్రాస్ మహిళ మృతదేహాన్ని ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రి నుంచి తరలిస్తున్న ఘటనపై దేశమంతా దృష్టి పెట్టిన సమయంలోనే ఆ ఘనట చోటు చేసుకుంది. లక్నోలోని ఆస్పత్రికి తరలిస్తుండగానే యువతి మృత్యువాత పడింది. తీవ్రమైనా గాయాలు కావడంతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. అవి ఎటువంటి గాయాలనేది తెలియడం లేదు. 

Also Read: ఏడ్చి మొత్తుకున్న తల్లి: గ్యాంగ్ రేప్ మృతురాలి అంత్యక్రియలు చేసిన పోలీససులు

ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ ఇద్దరిలో ఒకతను మైనర్. ఉదయం పనులకు వెళ్తుండగా తన కూతురిని కిడ్నాప్ చేశారని, ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని యువతి తల్లి చెబుతోంది. 

చివరకి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిందని, ఈ రిక్షాలో తన కూతురిని ఇంటికి పంపించారని ఆమె చెప్పింది. నిందితులు ఆమెకు ఇంజక్షన్ ఇచ్చారని, స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారని అంటున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తమ కూతురు మాట్లాడలేని, నిలబడలేని స్థితిలో ఉందని తల్లి చెప్పింది. 

Also Read: గ్యాంగ్ రేప్, చిత్రహింసలు: ఢిల్లీ ఆస్పత్రిలో యుపి మహిళ మృతి

తనను రక్షించాలని, చనిపోవడం తనకు ఇష్టం లేదని బాధితురాలు బోరుబోరున విలపించింది. బలరామ్ పూర్ కు సమీపంలోకి చేరుకోగానే ఆమె మరణించింది.

ఈ సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ ఘటన నుంచి దృష్టి మళ్లించడానికి ఇది జరిగిందా అని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios