Asianet News TeluguAsianet News Telugu

ఈ ఆలయాల్లో పురుషులకు నో ఎంట్రీ: విశాఖలో కూడా...

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని...దీన్ని అడ్డుకోడానికి ఎవరికి అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ ఆలయం తెరుచుకోనుండటంతో కొందరు మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించారు. అయితే ఇలా మహిళల ఆలయంలో ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ వారిని అడ్డుకున్నారు. దీంతో శబరిమల ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 

Men are not allowed in these 7 temples
Author
India, First Published Oct 17, 2018, 6:00 PM IST

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని...దీన్ని అడ్డుకోడానికి ఎవరికి అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ ఆలయం తెరుచుకోనుండటంతో కొందరు మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించారు. అయితే ఇలా మహిళల ఆలయంలో ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ వారిని అడ్డుకున్నారు. దీంతో శబరిమల ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దీంతో ఇలా ఆలయాల్లో మహిళల ప్రవేశంపై నిషేదం ఉండటంపై  తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కొన్నిచోట్ల మగవాళ్లు ప్రవేశించకుండా నిబంధలున్న ఆలయాలు కూడా మన దేశంలో వున్నాయి. అలా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఓ పీఠం ఉంది. ఇలాంటి ఆలయాలపై ఏషియా నెట్ స్పెషల్ స్టోరీ.


1. చక్కులతుకవు దేవాలయం, కేరళ

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్నట్లే అదే కేరళలో మరో దేవాలయంలో పురుషులపై నిషేదం కూడా ఉంది. అలపుంజ లోని చక్కులతుకవు భగవతీ దేవాలయంలోకి పురుషుల్ని రానియ్యరు.  ఏడాదికోసారి జరిగే నారీ పూజ సందర్భంగా కేవలం మహిళలనే అనుమతిస్తారు. అలాగే ధను అనే పేరుతో కూడా చక్కులతుకవు ఆలయంలో సంబరాలు జరుగుతాయి. ఆ సమయంలోనూ ఆడవారు పది రోజుల పాటూ ఉపవాసం చేసి అమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు.

Men are not allowed in these 7 temples

2. కొట్టన్‌కులన్‌గర దేవి ఆలయం, కేరళ

కేరళలోని మరో ఆలయంలో కూడా పురుషుల ప్రవేశంపై నిషేదం ఉంది. అదే కొట్టన్‌కులన్‌గర ఆలయం. ఆదిశక్తి  మరియు దుర్గా భగవతి దేవిని పూజించే ఈ ఆలయంలో కొన్ని పండగల సమయంలో ఈ నిషేదం ఉంది. అయితే ఈ సమయంలో పురుషుల మహిళల వేషధారణలో ఆలయంలో ప్రవేశించి అమ్మవారిని పూజించవచ్చు.

Men are not allowed in these 7 temples

3. కాళీ మాత దేవాలయం, బీహార్

  బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కాళీ మాత ఆలయం ఉంది. ఈ దేవాలయంలో కూడా  ప్రతీ మాసంలోని కొన్ని నిర్ధిష్ట సమయాల్లో మగవారు వెళ్లకూడదు. కనీసం పూజారులు కూడా ఆయా రోజుల్లో లోనికి వెళ్లరు. ఆ సమయంలో కేవలం మహిళలే అమ్మవారికి పూజలు చేస్తారు. మిగతా రోజుల్లో మాత్రం అందరూ అనుమతించబడతారు.

Men are not allowed in these 7 temples


4. కామాఖ్య పీఠం, ఆంధ్ర ప్రదేశ్ 

ఉత్తర భారత దేశంలోని గౌహతి నగరంలోని కామాఖ్య ఆలయం మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలోని కామాఖ్య పీఠంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురుషులను ఆలయంలోకి అనుమతించరు.  ప్రతి నెల అమ్మవారి నెలసరి వస్తుందని భక్తుల నమ్మకం. ఈ సమయంలో ఈ ఆలయంలోకి మగవారి ప్రవేశించకుండా నిషేదం విధించారు.

Men are not allowed in these 7 temples  

 

5. సావిత్రి ఆలయం, రాజస్థాన్
 
రాజస్థాన్ లోని రత్నగిరి పర్వత ప్రాంతంలోని సావిత్రి దేవాలయంలో కూడా మగవారి ఆలయ ప్రవేశం నిషేధం.  బ్రహ్మదేవుడు తన భార్య సరస్వతీ దేవీని విడిచి సావిత్రి దేవిని రెండో పెళ్లి చేసుకోవడంతో  చదువుల తల్లికి కోపం తెప్పించిందట. దీంతో సరస్వతి దేవి బ్రహ్నను శాపించిందని అందువల్లే ఈ ఆలయంలో మగవారి ప్రవేశంపై నిషేదం ఉందని చరిత్ర చెబుతోంది. 

Men are not allowed in these 7 temples  
6. భగవతి మాత ఆలయం, తమిళనాడు

ఇక మగవారి ప్రవేశం నిషేధం వున్న ఆలయం తమిళనాడులో ఉంది. కన్యాకుమారిలోని  భగవతీ మాతా ఆలయంలో మగవారు గుడి బయటే ఉండాలి. అయితే సన్యాసులకు మాత్రం ఆలయ ద్వారం వరకు అనుమతిస్తారు. ఆడవారు మాత్రం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకోవచ్చు. 

Men are not allowed in these 7 temples


7. అట్టుకల్ ఆలయం, కేరళ

తిరువనంతపురంలోని అట్టుకల్ ఆలయంలో కొలువైన కన్యకా దేవి అమ్మవారిని సంక్రాంతి సమయంలో దర్శించుకునే భాగ్యం పురుషులకు వుండదు. ఈ సమయంలో కేవలం మహిళలే అమ్మవారిని పూజించడం, దర్శించుకోవడం చేస్తారు.  ఆ సమయంలో ఈ ఆలయ పరిసరాల్లో కూడా పురుషులు కనిపించరు. 

Men are not allowed in these 7 temples

సంబంధిత వార్తలు

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్న

Follow Us:
Download App:
  • android
  • ios