దేశ రాజకీయాల్లో బద్ధ శత్రువులంటే కాంగ్రెస్, బీజేపీలే.. ఇంటా, బయటా ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరోకరు ఏదో రకంగా కక్ష సాధింపులకు దిగుతూనే ఉంటారు.

అలాంటిది కాంగ్రెస్ నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి బీజేపీ నేత సాయం చేశారు. వీరిద్దరూ ఎవరో కాదు.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.

జైట్లీ తన మరణానికి కొద్దిరోజుల ముందు సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలి నియోజకవర్గానికి ఒక బహుమతిని ఇచ్చారు. తన ఎంపీలాడ్ నిధులతో 200 సోలార్ పవర్ హై మాస్ట్ లైట్లను అమర్చాలని కోరుతూ ఆసుపత్రిలో చేరడానికి కొద్దిరోజుల ముందు జైట్లీ... రాయబరేలి జిల్లా యంత్రాంగానికి ఒక ప్రతిపాదనను పంపారు.  

ఆగస్టు 17న జైట్లీ ప్రతిపాదన రాయబరేలి జిల్లా యంత్రాంగానికి చేరిందని బీజేపీ నేత హీరో బాజ్‌పేయ్ తెలిపారు.  జూలై 30న జైట్లీ ఈ ప్రతిపాదనతో కూడిన లేఖను రాశారు.. జిల్లా కలెక్టర్ నేహా శర్మ కూడా ఈ మేరకు అరుణ్ జైట్లీ నుంచి ప్రతిపాదన అందినట్లు నిర్థారించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను చేపడతామని.. దీపావళి లోపల రాయబరేలిలో వెలుగులు నింపాలన్నది అరుణ్ జైట్లీ కోరికని నేహా శర్మ తెలిపారు. ఇప్పటికే హై మాస్ట్ లైట్లు ఎక్కడ బిగించాలన్న దానిపై అధికారులు నివేదిక సిద్ధం చేశారని ఆమె పేర్కొన్నారు.

కాగా.. ఎంపీలాడ్ నిధుల కింద ఒక్కో ఎంపీ సంవత్సరానికి రూ.5 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను తన నియోజకవర్గంలో చేపట్టవచ్చు.. ఇందు కోసం ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాల్సి వుంటుంది. కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ గత శనివారం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 

ముగిసిన జైట్లీ అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

బీజేపీ కేంద్ర కార్యాలయానికి జైట్లీ పార్థీవదేహం, మధ్యాహ్నం అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

జైట్లీ భార్యాకొడుకులతో మాట్లాడిన మోడీ: మిస్సవుతున్నా...

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

మోడీకి ఢిల్లీ గేట్స్ తెరిచింది జైట్లీనే

జైట్లీ మృతిపై కపిల్ సిబల్ దిగ్భ్రాంతి : క్రికెట్ లో మేమిద్దరం అంటూ ఫోటోలు విడుదల