కేంద్ర హోంశాఖ మంత్రి ఢిల్లీకి పయనమయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన తన పర్యటనను మధ్యలోనే ఆపేసి... ఢిల్లీకి ప్రయాణమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తను బీజేపీ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మరణ వార్త తెలిసిన వెంటనే అమిత్ షా ఢిల్లీకి బయలు దేరారు.

హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమంలో ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ మరణ వార్త వినాల్సి వచ్చింది.

దీంతో.. వెంటనే కార్యక్రమాన్ని మధ్యలో ఆపేసి ఢిల్లీకి బయలుదేరారు.  తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్ షా... ఆ క్రమంలోనే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.  కానీ అనుకోని దుర్వార్త వినాల్సి రావడంతో తన తెలంగాణ పర్యటననను అర్థాంతరంగా ముంగించాల్సి వచ్చింది. 

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం