Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ కేంద్ర కార్యాలయానికి జైట్లీ పార్థీవదేహం, మధ్యాహ్నం అంత్యక్రియలు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థీవ దేహాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సందర్శనార్ధం మధ్యాహ్నం 1.30 వరకు జైట్లీ భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. 

arun Jaitly dead body Sent to BJP Central Office
Author
New Delhi, First Published Aug 25, 2019, 10:56 AM IST

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థీవ దేహాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సందర్శనార్ధం మధ్యాహ్నం 1.30 వరకు జైట్లీ భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు.

మధ్యాహ్నం అంతిమ యాత్రగా బయల్దేరి 2.30 గంటలకు యమునా నది ఒడ్డున వున్న నిగంబోధ్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌ చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

న్యాయకోవిదుడిగా, పార్లమెంటెరీయన్‌గా జైట్లీ దేశప్రజలతో మన్ననలు అందుకున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే సుష్మా స్వరాజ్, జైట్లీ వంటి అగ్రనేతలను కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

జైట్లీ భార్యాకొడుకులతో మాట్లాడిన మోడీ: మిస్సవుతున్నా...

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

మోడీకి ఢిల్లీ గేట్స్ తెరిచింది జైట్లీనే

జైట్లీ మృతిపై కపిల్ సిబల్ దిగ్భ్రాంతి : క్రికెట్ లో మేమిద్దరం అంటూ ఫోటోలు విడుదల

 

Follow Us:
Download App:
  • android
  • ios