బెంగళూర్: కర్ణాటక అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్ప కాస్త కంగారు పడ్డారు. అసెంబ్లీ బలనిరూపణ పరీక్షలో గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ కాస్త అటు ఇటు అయితే ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఆయన కాస్త ఉక్కిరి బిక్కిరి అయ్యారు. 

స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశాలతో అసెంబ్లీ ఉద్యోగులు ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఒక్కో రో ప్రకారం ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నంత సేపు యడ్యూరప్ప ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఆయా పార్టీల సభ్యులను అసెంబ్లీ ఉద్యోగులు కౌంటింగ్ చేస్తున్నంత సేపు టెన్షన్ తో దిక్కులు చూస్తూ గడిపారు. ఎవరు ఉన్నారో, లేరో చూసుకుంటూ అటు ఇటూ దిక్కులు చూస్తూనే గడిపారు. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో గెలవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

బలనిరూపణ పరీక్షలో బీజేపీ గెలిచిన తర్వాత బయటకు వచ్చిన ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి హంగామాకు పోకుండా కేవలం విజయ సంకేతం చూపిస్తూ ముందుకు కదిలారు. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో బీజేపీ గెలవడంతో మరికొద్దిరోజుల్లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప అసెంబ్లీలో శాసన సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. 

ఇకపోతే ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం మౌనంగానే ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. కనీసం కౌంటింగ్ ఎలా జరుగుతుందోనన్న దానిపై కూడా స్పందించలేదు. దేవుడిపై భారం వేసినట్లు అలానే కూర్చుంటూ ఉండిపోయారు. 

అసెంబ్లీలో బలనిరూపణలో కాంగ్రెస్-జేడీఎస్ ఓడిపోయిందని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించడంతో కుమారస్వామి వేగంగా బయటకు వెళ్లిపోయారు. కాలినడకన రాజ్ భవన్ కు వెళ్లారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించేందుకు వెళ్లారు. 

మరోవైపు బలనిరూపణ పరీక్షలో భాగంగా అసెంబ్లీలో కౌంటింగ్ జరుగుతున్నంత సేపు కాంంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య మాత్రం నవ్వుతూనే ఉన్నారు. అంతకు ముందు బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేంద్రంలో అధికారంలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిందని ప్రజలు చూస్తున్నారని తగిన సమయంలో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఇకపోతే సభలో బలనిరూపణ పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని ముందే ఊహించారో ఏమో కానీ ముఖంపై మాత్రం చిరునవ్వు చెరగనివ్వకుండానే గడిపారు సిద్ధరామయ్య.  

ఇకపోతే మూడు వారాలపాటు సంక్షోభాన్ని అందరికంటే ఎక్కువగా అనుభవించిన స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం స్పీకర్ చైర్ లో కూర్చుంటూ హుందాగానే గడిపారు. బలనిరూపణ పరీక్షలో ఓడిపోతామని ముందే పసిగట్టారో ఏమో రాజీనామా లేఖను తన జేబులో వేసుకుని ఉన్నారు. 

బలనిరూపణ పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవడంతో ఆయన తన స్పీకర్ పదవికి ఎసరు వస్తుందని గ్రహించారు. అధికారులు తెచ్చిన కౌంటింగ్ ప్రక్రియను చూస్తూ ఒక్కో వస్తువును సర్దుకుంటూ కనిపించారు. ఆయన ముఖంలో అధికారం కోల్పోయామన్న బాధ స్పష్టంగా కనిపించింది. స్పీకర్ ముఖంలో కళ తప్పడంతో సంకీర్ణ ప్రభుత్వ సభ్యులు ఓడిపోయినట్లు ఒక అంగీకారానికి వచ్చేశారు. 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి