Asianet News Telugu

కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం, నెగ్గిన యడ్యూరప్ప

బలనిరూపణకు రెండు రోజులు ఆలస్యమైనందుకు తానే కారణమని అంగీకరించారు. తన పాలనలో ఏవైనా తప్పులు చేసి ఉంటే ప్రజలు పెద్దమనసుతో క్షమించాలని కుమార స్వామి అసెంబ్లీ సాక్షిగా కోరారు.  

karnataka cm kumara swamy speech in assembly
Author
Karnataka, First Published Jul 23, 2019, 6:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు ముగింపు పలికింది. సీఎం కుమారస్వామి కోరినట్లు డివిజన్ పద్దతిలో ఓటింగ్ ప్రారంభించారు స్పీకర్ రమేష్ కుమార్. అయితే బలనిరూపణ పరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం ఓటమిపాలైంది. 

కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి అనుకూలంగా కేవలం 99 ఓట్లు రాగా బీజేపీకి 105 ఓట్లు వచ్చాయి. దీంతో కుమార స్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అనంతరం శాసన సభను వాయిదా వేశారు స్పీకర్ రమేష్ కుమార్.

రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికింది అసెంబ్లీ. బలనిరూపణ పరీక్షకు అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కుమారస్వామి భావోద్వేగ ప్రసంగం అనంతరం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు.

బెల్ కొట్టి డివిజన్ పద్దతిలో ఓటింగ్ కు శ్రీకారం చుట్టారు. రెండు నిమిషాల అనంతరం తలుపులు మూసివేసి ఓటింగ్ ప్రారంభించారు. ఆయా పార్టీలకు చెందిన సభ్యులు ఆయా స్థానాల్లో ఉండాలని స్పీకర్ రమేష్ కుమార్ సభ్యులకు సూచించారు. ఓటింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

 బలనిరూపణ పరీక్షకు తాను సిద్ధమని స్పష్టం చేశారు సీఎం కుమార స్వామి. తాను అయితే డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభలో ఎంతమంది ఉన్నారనేది తనకు అనవసరమన్న సీఎం కుమార స్వామి డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. 

తన రాజకీయ జీవితంలో ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని చెప్పుకొచ్చారు. అయితే తనపై బీజేపీ చేసిన ఆరోపణలు బాధించాయని చెప్పుకొచ్చారు. తనను ఇరుకున పెట్టేందుకు తన బంధులపై ఐటీ దాడులు నిర్వహించి భయాందోళనకు నిర్వహించారని స్పష్టం చేశారు. 

తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని లూటీ చేశానని పదేపదే బీజేపీ ఆరోపించిందని అది తనను మానసికంగా బాధించిందని చెప్పుకచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. సీఎం పదవిని సంతోషంగా వదులుకుంటానని చెప్పుకొచ్చారు సీఎం కుమార స్వామి. 

అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తనను పిలిచారని గుర్తు చేశారు కుమార స్వామి. సోనియాగాంధీ పిలిచి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరితేనే తాను సీఎం అయ్యానని చెప్పుకొచ్చారు. అంతేకానీ సీఎం పదవి అంటే తనకు ఎలాంటి మోజు లేదన్నారు. 

తనకు సీఎం పదవి అవసరం లేదంటూ కర్ణాటక సీఎం కుమార స్వామి భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు స్పీకర్ రమేష్ కుమార్ విధించిన గడువు పూర్తవ్వడంతో సీఎం కుమార స్వామి ప్రసంగం ప్రారంభించారు.

సీఎం పదవీ త్యాగానికైనా తాను సిద్ధమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించి వేశాయని కుమార స్వామి స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ చేశానని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీతిగా, నిజాయితీగా పనిచేశానని చెప్పుకొచ్చారు.

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బలనిరూపణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రస్తుత సీఎం హెచ్ డి కుమారస్వామి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. 

బలనిరూపణకు రెండు రోజులు ఆలస్యమైనందుకు తానే కారణమని అంగీకరించారు. తన పాలనలో ఏవైనా తప్పులు చేసి ఉంటే ప్రజలు పెద్దమనసుతో క్షమించాలని కుమార స్వామి అసెంబ్లీ సాక్షిగా కోరారు.  

కర్ణాటక అసెంబ్లీలో కుమార స్వామి ప్రసంగం అనంతరం బలనిరూపణ పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలనిరూపణ పరీక్ష జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ విధించారు పోలీసులు. 

అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కుప్పకూలిపోతే ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు దిగింది ప్రభుత్వం. అలాగే రెండు రోజులపాటు మద్యం అమ్మకాలను కూడా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

అది నా అదృష్టపు గది, అందుకే అక్కడ ఉన్నా: కుమారస్వామి

Follow Us:
Download App:
  • android
  • ios