బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో సీఎం కుమారస్వామి ప్రసంగించడానికి కొద్ది గంటల ముందు కాంగ్రెస్, జేడీ(ఎస్) కార్యకర్తలు బెంగుళూరులో ధర్నాకు దిగారు.

ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు గతంలో  కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే వీరిద్దరూ కూడ ప్రస్తుతం బీజేపీకి మద్దతుగా నిలిచారు.కర్ణాటక విధాన సభకు పక్కనే ఉన్న నివాసంలో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారన్న విషయం తెలుసుకొన్న కాంగ్రెస్, జేడీ(ఎస్) కార్యకర్తలు ఆ ఇంటి ముందు ధర్నాకు దిగారు.

అయితే ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో పోలీసులు  ఇరు వర్గాలను చెదరగొట్టారు.ఇద్దరు ఇండిపెండెంట్లు బీజేపీ కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. 

కర్ణాటకలో బం నిరూపించుకొనేందుకు గవర్నర్  పలు దఫాలు కుమారస్వామి ప్రభుత్వానికి గడువు ఇచ్చాడు. కానీ, ఈ  గడువులు దాటినా కూడ బలపరీక్ష జరగలేదు. బలపరీక్ష విషయమై విపక్ష సభ్యుల ప్రశ్నలకు సీఎం కుమారస్వామి సమాధానం చెప్పిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది.

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

అది నా అదృష్టపు గది, అందుకే అక్కడ ఉన్నా: కుమారస్వామి

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి