Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి

అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవి అంటే ముళ్ల కిరీటంలా అనిపించిందన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమార స్వామి స్పష్టం చేశారు.

karnataka cm kumaraswamy sensational comments on bjp
Author
Karnataka, First Published Jul 23, 2019, 7:18 PM IST

కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీలో బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కుమార స్వామి. తనను గద్దె దింపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు చేసిందని ఆరోపించారు. బీజేపీ గద్దెనెక్కేందుకు చేయకూడని పనులు చేసిందని మండిపడ్డారు. 

కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం కుట్రలు పన్నుతున్న బీజేపీ కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహకరించలేదని విమర్శించారు. ఒక్క కేంద్రమంత్రి కూడా తనకు సహకరించలేదని చెప్పుకొచ్చారు. తనను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నో కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు.

ఇకపోతే తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పుకొచ్చారు. ఎందుకు వారు తనకు వెన్నుపోటు పొడిచారో అర్థం కావడం లేదన్నారు. తనను కాదని వారు ముంబై వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ సూట్ కేసు రాజకీయాలకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. కొందరిని ఐటీ దాడులు చేస్తామని బెదిరిస్తే మరికొందర్ని సూట్ కేసులతో కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. 

అయితే తాను ఎలాంటి కొనుగోలులకు పాల్పడలేదని స్పష్టం చేశారు కుమార స్వామి. దెవెగౌడ కుటుంబానికి సూట్ కేసులతో డబ్బులు పంచే అలవాటు లేదన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం నీతి నిజాయితీలతో పనిచేయడమే తెలుసునన్నారు. 

అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవి అంటే ముళ్ల కిరీటంలా అనిపించిందన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమార స్వామి స్పష్టం చేశారు. 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios