ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం నిరాకరించింది.

అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్ధిక నేరాల కేసుల్లో ముందస్తు బెయిల్ అనేది అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుందని ధర్మాసనం తెలిపింది.

పూర్వాపరాలను పరిశీలించిన మీదట చిదంబరం పిటిషన్ బెయిల్‌కు అర్హమైనది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసును మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి పూర్తి స్వాతంత్య్రం ఇస్తున్నట్లు పేర్కొంది.

కీలక దశలో విచారణ కొనసాగుతున్న ఇటువంటి పరిస్ధితుల్లో చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇస్తే.. దర్యాప్తుకు అంతరాయం కలగవచ్చునని సుప్రీం అభిప్రాయపడింది. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

చిదంబరానికి స్వల్ప ఊరట: తీహార్‌కొద్దు కస్టడీకి తీసుకోమన్న సుప్రీం

చిదంబరం అరెస్ట్... చాలా సంతోషంగా ఉందన్న ఇంద్రాణి ముఖర్జీ

చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....