Asianet News TeluguAsianet News Telugu

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది.  

INX Media Case: P Chidambaram's CBI custody extended till september 3
Author
New Delhi, First Published Sep 2, 2019, 5:52 PM IST

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది.  చిదంబరాన్ని కస్టడీ కోరుతూ... దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీం.. సీబీఐకి నోటీసులు ఇచ్చింది.

అయితే చిదంబరానికి మధ్యంతర రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోలేదని... జైలుకు పంపకుండా, బెయిల్ మంజూరు చేయాలని, లేదంటే హౌస్ అరెస్ట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సిబాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న సుప్రీం.. చిదంబరాన్ని జైలుకు పంపకుండా సెప్టెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. దీంతో బెయిల్ కోసం ట్రయల్‌కోర్టును ఆశ్రయించాలని సిబాల్‌కు న్యాయస్థానం సూచించింది.

అలాగే.. చిదంబరం పిటిషన్ వేస్తే పరిశీలించాలని ట్రయల్‌కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా ఒకవేళ బెయిల్‌ను తిరస్కరిస్తే చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపవద్దని సూచించింది.

కాగా.. తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే చిదంబరం కేసులో సవరణ చేసింది సుప్రీం. ఈ నెల 5 వరకు చిదంబరం కస్టడీని పొడిగించుకోవచ్చన్న ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు.. సీబీఐ కస్టడీని రేపటివరకే కోరుతామని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో చిదంబరం బెయిల్ పిటిషన్‌ను మంగళవారం మరోసారి విచారించాలని సుప్రీం నిర్ణయించింది. 

చిదంబరానికి స్వల్ప ఊరట: తీహార్‌కొద్దు కస్టడీకి తీసుకోమన్న సుప్రీం

చిదంబరం అరెస్ట్... చాలా సంతోషంగా ఉందన్న ఇంద్రాణి ముఖర్జీ

చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

Follow Us:
Download App:
  • android
  • ios