కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ ముఖర్జీ భార్య, ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జీ తాజాగా స్పందించారు.

చిదంబరం అరెస్టు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని... ఆయన కుమారుడు కార్తీ చిదంబరం  బెయిల్ కూడా క్యాన్సిల్ అయితే బాగుంటుందని ఆమె పేర్కొన్నారు.తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణీని నేడు ట్రయిల్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చిదంబరం అరెస్టు కావడం శుభవార్త. ఆయనను అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. ఇదే కేసులో కార్తీ చిదంబరానికి మంజూరైన బెయిల్‌ కూడా రద్దు కావాలి’’ అని ఆమె పేర్కొన్నారు.

కాగా... చిదంబరం అరెస్టు కావడంలో ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ద్వారా నిధుల్ని మళ్లించేందుకు బదులుగా తన కుమారుడు కార్తీ చిదంబరానికి సహాయం చేయాలని చిదంబరం తనను, తన భర్త పీటర్‌ ముఖర్జిను కోరినట్టు ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  ఆమె అప్రూవర్ గా మారి విషయాలను బయటపెట్టడం వల్లనే చిదంబరాన్ని  సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....