ఐఎన్ఎక్స్  మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీకి పొడిగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

తొలుత ఈ నెల 26వ తేదీ వరకు తొలుత కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు చిదంబరం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు.

చిదంబరాన్ని అరెస్ట్ చేయడం ద్వారా ఆయనకు సంక్రమించిన హక్కులను సీబీఐ కాలరాసిందని.... ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయస్థాన పరిధిలో విచారణ సాగుతున్న క్రమంలో సీబీఐ అత్యుత్సాహంతో ఆయనను అరెస్ట్ చేసిందని సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....