ఐఎన్ఎక్స్  మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆయనను విచారించాల్సి వున్నందున.. తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ.. న్యాయస్ధానాన్ని కోరింది.

అంతకు ముందు ఆయనను సీబీఐ కార్యాలయంలోని గెస్ట్ హౌస్ అంతస్తులోని లాక్-అప్ సూట్ 3లో ఉంచారు. విచారణలో భాగంగా ఇప్పటికే రెండో రౌండ్ కూడా పూర్తయినట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఇంద్రాణి ముఖర్జీ పాత్రపై సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. మొదటి దఫా ప్రశ్నావళికి ముందు భోజనం చేయాల్సిందిగా సీబీఐ అధికారులు ఆయనకు సూచించారు.

షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా... ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలపై తాము కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలుపుతున్నాయి. వీటి ఆధారంగానే సీబీఐ అధికారులు ప్రశ్నలు సంధించారు.

‘‘ ఇంద్రాణీ ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా మీకు ఎలా తెలుసు..? సొమ్ములు చేతులు మారే క్రమంలో ఎవరైనా ఇతర జర్నలిస్టుల పాత్ర ఉందా..? కంపెనీల లావాదేవీలు మీ కుమారుడి నియంత్రణలోనే జరిగాయా..? అంటూ ప్రశ్నలు దాడి చేశారు.

అలాగే బ్రిటీష్ వర్జీనియా ఐల్యాండ్ నుంచి కార్తీ ఎందుకు డబ్బులు తీసుకున్నారన్న దానిపైనా అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించినట్లుగా సమాచారం.

దీనికి ఆయన తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. రాత్రంతా చిదంబరం నిద్ర లేకుండా గడిపినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అడిగిన 20  ప్రశ్నలన్నింటికీ కూడా ‘‘చెప్పలేను’’, ‘‘స్పష్టంగా తెలియదు’’ అనే సమాధానం ఇచ్చారని అధికారులు తెలిపాయి.

అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి... 14 రోజుల రిమాండ్ కోరినట్లుగా తెలుస్తోంది. 

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!