పెళ్లయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతనిని పెళ్లి చేసుకుని.. అడ్డుగా ఉన్న మొదటి భార్యను దారుణంగా హత్య చేయించిందో లేడీ. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్‌‌కు చెందిన విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు స్థానికంగా ఉన్న వ్యాలీ వ్యూ ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. అది కొన్ని రోజుల్లోనే అక్రమ సంబంధానికి దారి తీసింది... షెఫాలీ మాయలో పడిన విక్రమ్ ఇంటిని మరిచిపోయి.. రోజూ ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు.

ఇలా ఉండగా వీరిద్దరూ ఆరు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దీని గురించి తెలుసుకున్న దీపిక తన భర్తను నిలదీయడంతో... భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భండారం మొత్తం బయటపడటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విక్రమ్ వెంటనే ఫెఫాలీకి మెసేజ్ పెట్టాడు.

దీనికి స్పందించిన ఆమె.. నీ భార్యను బిల్డింగ్‌పై నుంచి తోసి చంపేయాలని రిప్లయ్ ఇచ్చింది. దీంతో ముందు వెనుక ఆలోచించకుండా దీపికను అపార్ట్‌మెంట్‌లోని 8వ అంతస్తుకు తీసుకెళ్లీ.. అక్కడి నుంచి తోసేశాడు.

ప్రమాదంలో దీపిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన భార్య ప్రమాదవశాత్తూ బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోయిందని చెప్పాడు. అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దర్యాప్తును ప్రారంభించగా.. విక్రమ్ ప్రవర్తన అనుమానం కలిగించింది.. అతని కాల్ డేటా, మెసేజ్‌లను పరిశీలించగా, షెఫాలీతో కలిసి దీపికను చంపడానికి కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

మోడల్ తో అక్రమ సంబంధం..భార్యను అడ్డు తప్పించేందుకు

భార్యాభర్తలు.. మేలాపకం.. ఏంటి సంబంధం..?

టెక్కీ ప్రశాంత్ సూసైడ్‌లో ట్విస్ట్: ప్రణయ్‌తో వివాహేతర సంబంధం, మరో ఆడియో టేపు

వివాహితతో సంబంధం.. యువకుడిని చంపి బాయిలర్‌లో తగలబెట్టిన మహిళ బంధువులు

వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

ప్రేమపెళ్లి, మరో మహిళతో వివాహేతర సంబంధం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్తను కాదని వేరే వ్యక్తితో సంబంధం.. చివరకిలా..

భర్తని కాదని..అతనితో సంబంధం... అసలు కారణాలు ఇవే..

వదినతో వివాహేతర సంబంధం...చివరకి

భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని.. పక్కింటి వ్యక్తితో భార్య కూడా.

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....