హిందూ ధార్మిక వ్యవస్థలో గృహస్థాశ్రమ ధర్మం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలు సాధించుటకు గృహస్థాశ్రమమే మూలం. స్త్రీ పురుషులు ఇద్దరు ఆనందకరమైన జీవనానికి సహజీవనం. ధర్మాలు వ్యక్తులలో ఔన్నత్యాన్ని పెంచుతాయి అనడంలో సందేహం లేదు. దానికి శ్రీ సీతారాములే ఉదాహరణ. ఇద్దరు భిన్న వాతావారణ కుటుంబాలు, ప్రాంతాలు, ఆచారపు అలవాట్లు కల స్త్రీ పురుషులను ఒకటిగా ఏకం చేసే ప్రయత్నమే వివాహం. ఈ వివాహ ప్రయత్నానికి భారతీయ జ్యోతిషశాస్త్రంలో చక్కని అనుకూలత, అనురాగాలకు ఇరువురి జాతకాలో అనుకూలతలు, ప్రతికూలతలు తెలుసుకునే ప్రయత్నమే మేలాపకం. అర్థవంతమైన ఇద్దరి కలయిక జరగానికి అన్ని విషయాలో ఆనందంగా జీవనం సాగించడానికి వధూవరులిద్దరిలో సమసతుల్య స్థితి సాధించే పద్ధతినే మేలాపకం అని మన పూర్వీకులు శాస్త్రం ద్వారా మనకు తెలియజేశారు.

శ్లోకం :    వర్ణో వశ్యం తథా తారా యోనిశ్చ గ్రహమైత్రికం గణమైత్రం భకూటంచ నాడీ చైతే గుణాధికాః

వర్ణకూటమి       1,            వశ్యకూటమి      2,                            తారాకూటమి     3,            యోనికూటమి    4,

గ్రహమైత్రి         5,            గణకూటమి       6,                            రాశికూటమి      7,            నాడీకూటమి      8.

మొత్తం 36 గుణాలు, 18 గుణాలు దాటినే శుభప్రదమని వచనం. కానీ జాతకంలో బలాలను బట్టివీరి గణాలలో కొద్దిగా తగ్గినా వివాహం చేయవచ్చు అని అనుభవం తెలియజేస్తుంది. 16 లోపుగా గుణాలు వచ్చినట్లైతే నింద్యం, 18-20 వరకు మధ్యమం, 21-30  వరకు ఉత్తమం, 30-36 వరకు ఉత్తమోత్తమం.

అయితే మేలాపక ప్రక్రియలో అనుభవజ్ఞుల సూచనలు ఎంతో మేలు చేస్తాయి. మేలాపకం గణమేళనం ద్వారా మాత్రమే అనుకూలమని భావన చేయరాదు. ఇక్కడే అనుభవజ్ఞుల అవసరంఏర్పడుతుంది. గణమేళనంలో 30 గుణములు వస్తే అత్యుత్తమమని శాస్త్రం చెబుతుంది. మరి ఎందుకు వధూవరుల మధ్య అన్యోన్యత్వలోపం, జరిగే నష్టాలకు కారణాలు? పరిశోధన అవసరం.

పుణ్యంకొద్ది పురుషుడు, దానంకొద్ది బిడ్డలు అనే విషయాన్ని చూస్తే చేసుకునే పుణ్యాన్ని బట్టి భాగస్వామి దొరకడం చేసుకున్న దానిన్ని బట్టి సంతానం కలగడం అని సులభంగా అర్థమైన లగ్నంలో ఆలోచనా విధానం, సంకల్పం 9వ ఇల్లును బట్టి పుణ్యబలం అలాగే దానం అనేది వ్యయం నుండి పంచమం నుండి సంతాన బలం తెలుస్తుంది. దానం చేయడం వలన తాను దానం చేశాను అనే భావన మిమ్ము లను ఆలోచనాపరంగా ఉన్నతమైన భావాలు పెంపొందడం వలన పుణ్యబలం ఏర్పడి పంచమభావ బలం పెరిగి సంతాన భావానికి బలం చేకూరుతుంది అని గమనించినా, దానం చేయడంవలన పుణ్యబలం ఏర్పడి సంతానానికి మేలు కలుగుతున్నదని తెలుస్తుంది.

మేలాపకంతోపాటుగా పైన సూచించిన అంశాలను పరిశీలిస్తూ ఎక్కువగా పుణ్యబలం కూడగట్టుకునే ప్రయత్నం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు. దీనికి జపబలం ఎంతో అవసరం.  వీటి సమన్వయంతో (పుణ్య,దాన, జప బలాలు) కొన్ని స్థితులను అధిగమించడానికి స్పష్టమైన ఆధారాలు అవకాశాలను అనుభవజ్ఞులైన గురువుల ద్వారా అనుభవంలోకి వస్తున్నవి.

వివాహానికి తరువాత జరుగవలసిన ప్రక్రియలు నాగరికత పేరుతో ముందు జరుపుట అనర్థాలకు కారణమే కదా? యుక్తవయస్సు స్త్రీ పురుషులకు వివాహం పరమార్థం మన సంప్రదాయాల గొప్పదనం తెలియజేయాలి. కొన్ని సందర్భాలలో 'ఆధాన'' ముహూర్తం ఆవశ్యకత ఉందా? అని భావనలు కలిగిస్తున్న కొంతమందిని చూసినపుడు మనము ఇంకా రామరాజ్యంలోనే ఉన్నామని భానవ కలుగు తుంది. నాటి వివాహ వ్యవస్థకు నేటి వివాహ వ్యవస్థకు, గోవుకు, జెర్సీ ఆవుకి ఉన్నంత భేదం ఉంది.

డా.ఎస్.ప్రతిభ