అనీల్ కి తన వదినతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దాని కారణంగానే ఈ హత్య జరిగనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తల్లిలాంటి వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరకులోయ సమీపంలోని పెదబయలు మండలం పెదకోడాపల్లికి చెందిన మండి అనీల్‌కుమార్ కొన్నేళ్ల పాటు పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు(నర్సరీ పక్కన) తన అన్న వదినలు మండి రామకృష్ణ, అమ్మలు ఇంట్లో నివాసం ఉన్నాడు.
గత ఏడాది భారీగా ఖర్చు చేసి అనీల్‌కుమార్‌కు అన్న వదినలు వివాహం చేశారు. అతనికి పాప కూడా ఉంది. ఇటీవల కుటుంబ గొడవల వల్ల అవి తగ్గేంత వరకు కుమార్తెతో సహా తన భార్య కుమారిని అనీల్‌కుమార్ ఆమె పుట్టింటికి పంపాడు. కాగా.. సోమవారం సాయత్రం ఊరిచివర ఓ పాడుబడ్డ ఇంటి వద్ద శవమై కనిపించాడు.
అనీల్‌కుమార్ హత్య పథకం ప్రకారం జరిగినట్టు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఐదు క్వార్టర్ ఎంసీ బాటిళ్లు, నాలుగు బీరుబాటిళ్లు, మరో మద్యం బాటిల్ సంఘటన స్థలానికి సమీపంలో ఉన్నా యి. హత్య జరిగిన సమయంలో అక్కడ ఐదుగురు మద్యం తాగినట్టు డిస్పోజబుల్ గ్లాసుల బట్టీ తెలుస్తోంది. అనీల్‌కుమార్‌ను కూడా పూట గా మద్యం తాగించి పథకం ప్రకారం హత్య చేసి ఉంటారనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. అనీల్ కి తన వదినతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దాని కారణంగానే ఈ హత్య జరిగనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
