భర్తను కాదని.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత... చివరకు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఆవ వాంబే కాలనీకి చెందిన ముల్ల కృష్ణకుమారికి పశ్చిమ గోదావరి జిల్లా టేకూరు గ్రామానికి చెందిన యర్రంరెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. కుమారి ఆ ఊర్లోనే ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈ క్రమంలో ప్రసాదరెడ్డి అనే అతనితో పరిచయమై సహజీవనం సాగిస్తోంది.
 
కొంతకాలం క్రితం నగరంలోని వాంబే కాలనీలో ఒక ఇల్లుకు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ప్రసాదరెడ్డి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోను చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో మనస్తాపం చెందిన కుమారి ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో ఒక సారి ప్రసాదరెడ్డి ఈ విధంగానే చేయగా బొమ్మూరు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్న ఔట్‌పోస్ట్‌ పోలీసులు బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు.