Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థినుల రెస్ట్‌రూమ్‌లో మొబైల్‌తో రికార్డ్: ప్రాజెక్టు ఆఫీసర్ అరెస్ట్

విద్యార్ధినుల రెస్ట్ రూమ్ లో మొబైల్  పెట్టి రికార్డు చేసేందుకు యత్నించిన ప్రాజెక్టు ఆఫీసర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై ఐఐటీలో చోటు చేసుకొంది.

IIT Madras researcher arrested for filming female student in washroom
Author
Chennai, First Published Feb 21, 2020, 8:28 AM IST

చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థినుల రెస్ట్ రూమ్ లో సెల్‌ఫోన్ ద్వారా దృశ్యాలను రికార్డు చేసేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మద్రాస్ ఐఐటీ కాలేజీ రెస్ట్ రూమ్ లో  ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసే  శుభం బెనర్జీ మొబైల్ ఫోన్‌ను పెట్టారు. రెస్ట్ రూమ్ కు వెళ్లిన విద్యార్థుల దృశ్యాలను ఈ ఫోన్ లో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు.

కర్ణాటకలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్ధిని రీసెర్చి కోసం మద్రాస్ ఐఐటీకి వచ్చింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ల్యాబ్ వద్ద ఉన్న రెస్ట్ రూమ్ కు వెళ్లింది. రెస్ట్ రూమ్ కిటికీ వద్ద సెల్ ఫోన్ ఉన్న విషయాన్ని ఆమె గుర్తించింది.

ఆ సమయంలో ఫోన్ రికార్డులో ఉన్న విషయాన్ని ఆమె గుర్తించింది. పక్కనే ఉన్న పురుషుల వాష్ రూమ్ ను బయట నుండి ఆమె లాక్ చేసింది. సెక్యూరిటీని పిలిచి పురుషుల వాష్ రూమ్ డోర్ ను ఓపెన్ చేసింది.

పురుషుల వాష్ రూమ్ నుండి శుభం బెనర్జీ బయటకు వచ్చారు. శుభం బెనర్జీ వద్ద ఉన్న ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫోన్ లో ఎలాంటి ఫోటోలు, వీడియోలు లభ్యం కాలేదు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios