Asianet News TeluguAsianet News Telugu

నేను సంతృప్తి చెందితే అదే నాకు ఆఖరు రోజు : Asianet News Exclusive interviewలో మోదీ (వీడియో)

Summery: ప్రధాని నరేంద్ర మోదీ ఏసియానెట్ న్యూస్ కి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 82 నిమిషాల పాటు దేశంలోని రాజకీయ, అభివృద్ధి, ఇతర కీలక అంశాలపై మాట్లాడారు.

prime minister Narendra Modi exclusive interview with Asianet News
Author
First Published Apr 20, 2024, 8:10 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఏషియా నెట్ సువర్ణ న్యూస్, ఏషియా నెట్ న్యూస్, కన్నడ ప్రభ,  Asianet News డిజిటల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏసియానెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ రాజేశ్ కల్రా, ఏసియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్, ఏసియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమఖ్కనవర్‌లతో దాదాపు 82 నిమిషాల పాటు ముచ్చటించారు.

ఆ ఇంటర్వ్యూ వివరాలు యథా తథంగా చదవండి

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ప్రశ్న : మీరు రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి విజయం కోసం భారత  వృద్ది గురించి మాట్లాడున్నారు. ఈ దేశ వృద్ది, మీ విజయం మధ్య కాంబినేషన్ ఏమిటి?

జవాబు : చూడండి... మొదటి విషయం ఏమిటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలనే ఆకాంక్ష ప్రతి రాజకీయ పార్టీకి వుంటుంది.  ప్రజల విశ్వాసంతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతాలను, కలలను అమలు చేసేందుకు ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి ఆశయం లేకపోతే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 

 

ప్రజాస్వామ్యం ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక రోజు అధికారంలోకి వచ్చి తమ ఆలోచనల ఆధారంగా దేశానికి సేవ చేస్తామనే భావన కలిగి ఉండాలి. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. బిజెపి విషయానికొస్తే... 2014కు ముందు కాంగ్రెస్‌కు 5-6 దశాబ్దాలు పాలించే అవకాశం వచ్చింది. 

ఆనాడు వారికి ప్రతిపక్షం లేదు. ఇప్పటిలాగ మీడియా కూడా అంతగా లేదు... వున్నా ఇంత ఎఫెక్టివ్ గా పనిచేసేది కాదు. అంటే ఓ రకంగా వారు ఏం చేసినా ఎదురు చెప్పేవారు లేరు... దేశం కూడా వారి వెంటే ఉండేది.

 స్వాతంత్య్రోద్యమం తర్వాత సెంటిమెంట్లు ఉన్నందున యావత్ దేశం వారు కోరుకున్నది చేయగలిగింది. కానీ వారు ఆ అవకాశాన్ని కోల్పోయారు. క్రమంగా పరిస్థితులు మరింత దిగజారడం ప్రారంభించాయి. అలాంటి పరిస్థితుల్లో 2013లో నాకు భారతదేశం గురించి    ఏం తెలుసు, ప్రపంచం గురించి ఏం తెలుసో ప్రజలకు చెప్పాను. 

దేశం సమస్యాత్మక పరిస్థితుల్లో వున్నపుడు ప్రజలు నన్ను నమ్మారు... సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. 2014 సంవత్సరంలో ఆశలు చిగురించాయి. ప్రజల హృదయాల్లోనే కాదు నా ఆలోచనల్లోనూ ప్రజల అంచనాలను నెరవేరుస్తామనే ఆశ ఉంది.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

వచ్చే ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడపడం అంటే.... నేను పాలించను, ప్రజాసేవ చేస్తానంతే. నా దృష్టిలో ప్రభుత్వాన్ని నడపడం అంటే పాలించడమని అర్థం కాదు. సేవచేయడం. నేను ప్రధాని పీఠంపై కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునే రకం కాదు. నేను ప్రజల కోసం సాధారణ పౌరుడికంటే కష్టపడి పనిచేస్తా. 

మా పనితీరును ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. 2014లో ఆశాజనక వాతావరణం ఉంటే, 2019లో అది విశ్వాసంగా మారింది. సామాన్య ప్రజలు చూపించే నమ్మకం నాలో కొత్త విశ్వాసాన్ని నింపింది. మేము సరైన దిశలోనే ఉన్నామని అనుకున్నాను.

దేశంలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రాన్ని అమలు చేయగలిగాం. 2019 లో ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళాము... కానీ 2024లో  దేశ ప్రజల వద్దకు వెళుతున్నాము.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13-14 ఏళ్ల అనుభవం, 10 ఏళ్ల ప్రధానిగా అనుభవంతో చెబుతున్నా ... నా పనితీరును బట్టి చెబుతున్నా...   ఈసారి ప్రజలవద్దకు గ్యారంటీలతో వెళుతున్నాము. అంటే మొదట ఆశ, తర్వాత నమ్మకం, ఇప్పుడు హామీ. ఒక హామీ ఇచ్చామంటే అది మనపై పెద్ద బాధ్యతను పెడుతోంది.  

ప్రపంచానికి ఈరోజు భారత్‌పై నమ్మకం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. 30 ఏళ్లుగా భారత్‌లో అస్థిర ప్రభుత్వాలను ప్రపంచం చూసింది. అస్థిర ప్రభుత్వాల వల్ల దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ప్రపంచం ముందు భారత్‌కు విలువ లేకుండా పోయింది.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

అయితే సుస్థిర ప్రభుత్వం ఏం చేయగలదో దేశ ఓటర్లు చూశారు. అందుకే మోడీ 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అనుకుంటున్నారు. బీజేపీ పోటీ చేయడం లేదని అనుకుంటున్నారు.... దేశ ప్రజలే పోటీ  చేస్తున్నట్లు భావిస్తున్నారు. దేశ ప్రజలు 10 ఏళ్ల అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు... అందుకే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది.

 

ప్ర) ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సెంటిమెంట్ ఎలా వుందని మీరు భావిస్తున్నారు ?

జ) నేను చాలా కాలంగా ప్రజా జీవితంలో పని చేస్తున్నాను. నేను 'సంఘటన్' కార్యకర్తగా కూడా పనిచేసాను. 

కాబట్టి పరిస్థితులు ఎలా వున్నాయో అర్థంచేసుకోగలను. నేను జ్యోతిష్కుడిని కాదు కానీ నేను ఎక్కడికి వెళ్లినా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోగలను... దాన్ని బట్టి మాట్లాడగలను. 

నేను ఎన్నికల సమయంలో మాత్రమే పర్యటనలు చేసే వ్యక్తిని కాదు... సాధారణంగా వారానికోసారి ప్రయాణిస్తాను. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం ఏదో ఒక ప్రదేశానికి వెళ్తాను. నేను అధికారిక పనులు కూడా ప్రజల మధ్యనే చేస్తున్నాను.. కాబట్టి నేను మారుతున్న పరిస్థితులను అంచనా వేయగలుగుతున్నా. 

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ఇప్పుడు కనిపిస్తున్న వన్ సైడ్ వాతావరణం ఎన్నికలు ప్రకటించిన తర్వాత సృష్టించబడలేదని నేను నమ్ముతున్నాను. ప్రజల అపూర్వ మద్దతుతో పాటే గత 10 సంవత్సరాలుగా ఇది పెరుగుతూ వస్తోంది.  మీరు సాధారణ ఓటరు అయితే ఓటు వేసేటప్పుడు ఏమనుకుంటారు? నేను దేశాన్ని ఎవరికి ఇస్తున్నాను? అని ముందుగా మీరు ఆలోచించండి. 

అప్పుడు మీరు చూసే వ్యక్తులను పోలుస్తారు. అప్పుడు అనుకుంటారు మేము దేశానికి మంచి చేసిన ట్రాక్ రికార్డ్ వున్నవారి చేతుల్లో పెట్టాలని. చెప్పింది చేసి చూపించేవారిని ఎన్నుకుంటారు. ఇలాగే ఓ ఆలోచన ఏర్పడుతుంది. రెండవది మా మిత్రపక్షాలు ఎవరు, మా ఆలోచన ఏమిటి, మా ఎజెండా ఏమిటో మీరు చూస్తారు. 

ఇదే క్రమంలో ఇతరుల పనులు, అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. ఈ ఎన్నికలలో ఒక మంచి విషయం ఏమిటంటే 2014లో ఓటర్లు పోల్చడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పుడు చాలా కోపం వచ్చింది.  కానీ ఈసారి (గత ప్రభుత్వం) చేసేదానితో పోల్చారు... మోడీ ఇది చేస్తున్నారు, వాళ్లు ఈ తప్పు చేసారు, కానీ మోడీ చేయలేదు. వాళ్లు తప్పు చేసేవారు, మోదీ చేయరు. ఇలా  ఇలా పోల్చడం ద్వారా ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు.  అందుకే వారి కళ్లలో ప్రేమ, ఆకర్షణతో పాటు 'మిమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాం మోదీజీ! మీరు ప్రశాంతంగా ఉండండి, చింతించకండి'అనే బాధ్యత కనిపిస్తోంది.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ప్ర) మీ ప్రభుత్వం ఇప్పటివరకు అవినీతికి వ్యతిరేకంగా ఉంది. మీరు పూర్తిగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతారని నమ్మకం వుంది. కానీ మీరు రాజకీయ కారణాలతో కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది అంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఒక విధానం ఉంది, కానీ ఇది రాజకీయ కారణాలతో ప్రభావితం అవుతోంది. దీని గురించి మీరు ఏం చెబుతారు?

జవాబు : మీరు దీనిని గమనించినందుకు నేను కృతజ్ఞుడను. నేను ఆర్థికంగా బలమైన రాష్ట్రానికి చెందినవాడిని... 13 సంవత్సరాలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపాను. ఇక గత 10 సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్నాను. ప్రజలు నా జీవితాన్ని చూస్తున్నారు. నా సహచరులు కూడా నా జీవితాన్ని చూస్తున్నారు. వారు నా పద్దతులు చూసారు. నేను ఇలాంటి విషయాలకు విలువ ఇస్తే ఎవరూ అడుగు కూడా బయటపెట్టలేరు.  

రెండవ విషయం ఏమిటంటే మొదటినుండి నా ప్రభుత్వాన్ని పాలసీలే నడిపించాలని కోరుకుంటాను. కొన్నిసార్లు విధానాల రూపకల్పనలో తప్పులు జరుగుతుంటాయి... వాటిని గుర్తించి విమర్శించే హక్కు ప్రజలకు వుంటుంది. ఫాలసీతో తప్పొప్పులు వున్నపుడు అధికారులు కూడా చూస్తాం, చేస్తాం అనే పరిస్థితి వుండదు. వివక్షకు అవకాశం వుండదు. ఇక పౌరులు కూడా అది తన హక్కు అయితే దక్కుతుంది... లేదంటే దక్కదని భావిస్తారు. కాబట్టి ఫాలసీలపై నమ్మకం పెరుగుతుంది.  

మేము కూడా కొన్ని అడుగులు వేయడం మీరు చూసారు. గతంలో 3, 4వ స్థాయి ఉద్యోగుల నియామకానికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూ కేవలం 30 సెకన్లలో ముగిసిపోయేది. అభ్యర్ధి మంచివాడా, చెడ్డవాడా అని కేవలం 30 సెకన్లలో నిర్ణయించగల తెలివైన వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. కాబట్టి   ఇంటర్వ్యూ విధానం తీసివేయాలని చెప్పాను. అన్ని అర్హతలు గలవారు తమ బయోడేటా ఆధారంగా దరఖాస్తు చేసుకుంటారు...ఉద్యోగాలకు ఎవరు అర్హులో, ఎవరు కాదో కంప్యూటర్ నిర్ణయిస్తుంది. కంప్యూటర్ ఫలితాల్లో వచ్చిన మొదటి 200 మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను అందజేయండని చెప్పాను. అయితే అనుకున్నట్లుగా కాకుండా ఏ ఇద్దరో, ఏ నలుగురో బలహీనమైన వారు ఎంపిక కావచ్చు... కానీ పాదర్శకంగా నియామకం జరిగింది కాబట్టే తనకు అవకాశం వచ్చిందని భావిస్తాడు. తన స్కిల్స్ పెంచుకుని బాగా పని చేయడానికి ప్రయత్నిస్తాడు. 

ఇప్పుడు ఆదాయపు పన్ను మదింపు ఉంది... చాలా ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ అవినీతికి అవకాశం ఉంది... కాబట్టి మేము దానిని సాంకేతికతతో అనుసంధానించాము. కాబట్టి ఈ రోజు ముంబైలో ఫైల్ అయిన ఆదాయపన్ను గౌహతి, చెన్నై, కొచ్చి ఎక్కడైనా వుండొచ్చు... ఈ విషయం ఎవరికీ తెలియదు. అందువల్ల ఎలాంటి అవినీతికి తావులేకుండా పనులు జరుగుతాయి.... దీంతో ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది.  కాబట్టి మేము డిజిటల్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. 

మేము పనుల్లో మానవ జోక్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు మనకు GeM పోర్టల్ ఉంది. మీరు GeM పోర్టల్‌కి రండి... ప్రభుత్వం ఏ కొనుగోలు చేసినా GeM పోర్టల్ లో వుంటుంది. ఈ పోర్టల్ తో వేగంగా మరియు నాణ్యతతో కూడిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మేము కలిగి ఉన్న ఆన్‌లైన్ మెకానిజం, సౌకర్యవంతమైన కార్యాచరణ  అన్ని విషయాల మంచి ఫలితం ఇస్తుందని నమ్ముతున్నాను.

'మేము 1 రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుకుంటాయి' అని కొందరు ప్రధానులు అన్నారు. అలా మధ్యమధ్యలో ఎవరో ఒకరు ప్రజాధనం తింటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. మేము 1 రూపాయి పంపితే 100 పైసలు ప్రజలకు అందుతాయి. కాబట్టి సామాన్య పౌరుడు కూడా తనకు దక్కాల్సింది సంపూర్ణంగా దక్కిందని భావిస్తాడు.   కరోనా సంక్షోభ సమయంలో కూడా దేశం పూర్తిగా ప్రభుత్వానికి అండగా వుంది... ప్రజలు దేశం పెద్ద సంక్షోభం ఉందని నమ్మారు... మనలాంటి వారు కష్టపడి పనిచేస్తే దేశానికి మేలు జరుగుతుందని భావించారు.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ప్ర) ఈడి, సిబిఐ దుర్వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి...

జవాబు ; నేను ఆశ్చర్యపోయాను. రైల్వేలో టికెట్ కలెక్టర్ పనిని ఉదాహరణ తీసుకుందాం. అతను టిక్కెట్లను ఎందుకు తనిఖీ చేస్తాడు? మనం నిజాయితీ లేనివాళ్లమా? అని కూడా కొందరు అడగవచ్చు. కానీ టిక్కెట్లను తనిఖీ చేసే బాధ్యత టికెట్ కలెక్టర్ దే. 

అదేవిధంగా ED లేదా CBI సృష్టించబడ్డాయి... వారి బాధ్యతలు వారికి వున్నాయి. ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఆపకూడదు. వారి పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. వారు స్వతంత్రంగా పనిచేసేందుకు అనుమతించాలి. టికెట్ కలెక్టర్ ను అనుమతించినట్లే, వారిని కూడా అనుమతించాలి.

రెండవది... ఈడి అవినీతికి వ్యతిరేకంగా  అనేక రకాల కేసులు నమోదు చేసింది... అది ప్రభుత్వ అధికారులైనా లేదా డ్రగ్ మాఫియా అయినా. ఈడి కేసుల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే రాజకీయాలతో ముడిపడి ఉన్నారు... మిగతా 97% శాతం తమ పనిలో నిజాయితీగా వ్యవహరించకపోవడంతోనే పట్టుబడ్డారు. ఇలా చాలామంది అధికారులు ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటికి వెళ్లిపోతే మరికొందరు జైలుకు వెళ్లారు. దీని గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు గత ప్రభుత్వాలే పలు సంస్థలను ఏర్పాటుచేసాయి... మేము కాదు. అయినా పని చేయకపోతే ప్రశ్నించాలి కాని  పని చేస్తున్నారని ప్రశ్నించడం ఏమిటి. ఇది లాజికల్ గా అనిపించడంలేదు. 

ఇప్పటి వరకు ED కేవలం 3 శాతం మందిని మాత్రమే చేరుకుంది. ఇకా 97 శాతం మంది మిగిలే వున్నారు. అవినీతి ఆధారంగానే న్యాయం జరుగుతుందనడం నిజం కాదు. ఉదాహరణకు ఒక వంతెన ఉందనుకుందాం.అవినీతికి పాల్పడి ఆ బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టు ఇస్తే ఆ నిర్మాణం కూడా  అలానే వుంటుంది. అలా కట్టిన వంతెన కొన్నేళ్లకే కూలిపోయింది. ఆ నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పండి. అదేవిధంగా ఒక సాధారణ పౌరుడు తన పరీక్షలలో చాలా కష్టపడి పాస్ అయ్యాడు. కానీ అతని వద్ద రికమండేషన్ లెటర్ లేనందున ఉద్యోగం పొందలేకపోయాడు. బదులుగా పనికిరాని వ్యక్తి ఉద్యోగం పొందుతాడు. ఇలాంటి పరిస్థితి ఇక దేశంలో ఎంతో కాలం ఉండదు.

2014కి ముందు ఈడి (పిఎమ్‌ఎల్‌ఎ) 1800 కంటే తక్కువ కేసులను నమోదు చేసింది. ఆ సమయంలో ప్రభుత్వమే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేది. కానీ    2014 తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది... ఈ పదేళ్లలో ఈడి 5000కు పైగా కేసులు పెట్టింది. ఇది దాని సామర్థ్యాన్ని, పనితీరును తెలియజేస్తుంది.    2014కి ముందు కేవలం 84 సోదాలు నిర్వహించారు. అంటే అంత పెద్ద డిపార్ట్‌మెంట్ నిద్రపోతోంది. 2014 నుండి 7000 సోదాలు జరిగాయి.

2014కు ముందు సుమారు రూ.5000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. 2014 తర్వాత రూ.1.25 లక్షల కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఇది దేశ ఆస్తి. ఇప్పుడు చెప్పండి ఈ డి ట్రాక్ రికార్డ్ మనకు ఏమి చెబుతుంది? ఈడిక ట్రాక్ రికార్డు దాని సామర్థ్యం, స్వతంత్రంగానే ఎంత పెద్ద స్థాయిలో పనిచేస్తుందో తెలియజేస్తుంది. మనం దేశం నుండి అవినీతిని తొలగించాలనుకుంటే అందుకోసం ఏర్పాటుచేసిన సంస్థలను స్వతంత్రంగా పని చేయడానికి మనం అనుమతించాలి. రాజకీయ నాయకులు ఇలాంటి సంస్థల్లో వేలు పెట్టకూడదు. అందుకే నేను ప్రధానమంత్రి అయినప్పటికీ ఈడీ పనిని అడ్డుకునే హక్కు నాకు లేదు.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ప్ర) మీరు దక్షిణ భారతదేశంపై దృష్టి పెట్టారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. తెలంగాణలో అదే జరిగింది. ఇప్పుడు 131 లోక్ సభ స్థానాల్లో 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాలు గెలుస్తామ‌న్న ఆశతో వున్నారు... అది సాధ్య‌మ‌ని భావిస్తున్నారా?

జవాబు : చాలాకాలంగా బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనేలా పరిస్థితిని సృష్టించారు. కానీ నిజం ఏమిటంటే బిజెపిలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులు ఉన్నారు. నా మంత్రివర్గంలోనే గరిష్ట సంఖ్యలో ఓబీసీలు ఉన్నారు. అప్పుడు బీజేపీ అర్బన్ పార్టీ అనే మరో కథనాన్ని సృష్టించారు. ప్రస్తుతం మా పార్టీ గ్రామాల్లో బలంగా వుందని... గ్రామీణ ప్రజలే ఎక్కువగా పార్టీవెంట వున్నారు. దీంతో ఈసారి బీజేపీ చాలా సంప్రదాయ పార్టీగా ముద్రపడింది... ఈ పార్టీ కొత్తగా ఏమీ ఆలోచించదని అంటున్నారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యమానికి ఎవరైనా నాయకత్వం వహిస్తున్నారంటే అది బీజేపీ పాలక ప్రభుత్వమే. కాబట్టి బిజెపిని అడ్డుకునేందుకు ప్రచారం జరుగుతున్న కథనాలన్ని అపోహలు మాత్రమే. 

రెండోది తెలంగాణలో చూసుకుంటే బీజేపీ ఓట్ల శాతం ఇప్పుడు రెండింతలు పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. అత్యధిక ఎంపీలు బీజేపీకి చెందినవారే. గతంతో పోలిస్తే 2024లో ఓట్ల శాతం చాలా పెరుగుతుందని నేను నమ్ముతున్నాను.

దక్షిణాది ప్రభుత్వాల గుర్తింపు ఏమిటి? కాంగ్రెస్ అయినా, ఎల్‌డీఎఫ్ అయినా, డీఎంకే అయినా అన్ని చోట్లా వుందా? ఈ రోజు మనం పుదుచ్చేరిలో అధికారంలో ఉన్నాం. పుదుచ్చేరి దక్షిణాదిలో ఉందికదా...  ఎక్కువగా దక్షిణాది వారు, బెంగాలీ నివసించే అండమాన్ నికోబార్‌లో మా ఎంపీ విజయం సాధించారు.

కుటుంబ పార్టీలు, ప్రభుత్వాలు వున్నచోట భారీ అవినీతి వుంది. ఇప్పుడు దక్షిణాదిన ఎలాంటి పరిస్థితి వుందో చూడండి. కాంగ్రెస్ యువవరాజు రాహుల్ గాంధీ ఉత్తరాది నుండి పారిపోయి దక్షిణాదిలో ఆశ్రయం పొందుతున్నాడు. ప్రస్తుతం అతడు వయనాడ్ లో పోటీ చేస్తున్నాడు. అయితే అతడి పరిస్థితి ఎలా వుందంటే ఏప్రిల్ 26న వయనాడ్ లో పోలింగ్ ముగియగానే మరో చోట పోటీ చేయాలని భావిస్తున్నాడు. మరో సీటుకోసం వెతుకుతున్నాడు.నేను చెప్పే ఈ మాటలు రాసిపెట్టుకొండి. 

కాంగ్రెస్ కు చెందిన పెద్ద నాయకులు ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని... రాజ్యసభకు వెళతారని నేను ఒకసారి పార్లమెంటులో ప్రకటించాను. నేను ఈ మాట చెప్పిన ఒక నెలరోజుల తర్వాత అతిపెద్ద నాయకురాలు లోక్‌సభ నుండి నిష్క్రమించవలసి వచ్చింది. ఆమె రాజ్యసభకు వెళ్లారు. అంటే ఓటమి అంగీకరించినట్లు కదా. ఈసారి కూడా తాను చెప్పినట్లు జరుగుతుందని నమ్ముతున్నాను.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ క్రతులు జరుగుతున్నపుడు నేను దక్షిణాదిన పర్యటించాను. అప్పుడు అక్కడి ప్రజలు నాపై చూపిన ప్రేమ మరియు  విశ్వాసం అపూర్వమైనది. కాబట్టి ఇప్పుడు భ్రమలన్నీ తొలగిపోతాయి.  అతి త్వరలోనే చాలామంది దక్షిణాది బిజెపి నేతలకు కూడా వారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది.  చాలా ఎక్కువమందికి తనతో కలిసి పార్లమెంట్ లో పనిచేసే అవకాశం దక్కుతుంది. దక్షిణాదిన  ఓట్ షేర్ కూడా గణనీయంగా పెరుగుతుంది.

ప్రశ్న : కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీ పథకాలపై మీ అభిప్రాయం ఏమిటి ? భారతదేశ వృద్ధికి ఉచితాలు తోడ్పడతాయా? అలాంటి ఉచితాలను భారతదేశం భరించగలదా?

సమాధానం : కేవలం వాళ్లకి మాత్రమే దీని  గురించి. నైరాశ్యంలో మునిగిన రాజకీయ పార్టీలే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి.గుజరాత్‌లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అదే సమయంలో ప్రజలు నాకు 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. నాకు ఇలా సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ అనుభవంతో చెబుతోంది ఏమిటంటే దేశ ప్రజలను సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.

ఆర్థిక స్థోమత ఉన్నవారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని నేను ఒకసారి ఎర్రకోట నుండి చెప్పాను. దీంతో కోటిమందికి పైగా ప్రజలు గ్యాస్ సబ్సిడీలను వదులుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆహారం మానేయమని పిలుపునిచ్చినప్పుడు ప్రజలు దానిని అనుసరించారని చెబుతుంటారు. నేటికీ ప్రజలే మనకంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు... దేశం కోసం మనకంటే ఎక్కువగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిని మనం తక్కువ అంచనా వేయకూడదు.   కోవిడ్-19 సమయంలోనే చూడండి... నేను పార్లమెంటులోని ఎంపీలను వారి జీతాలను వదులుకోమని అభ్యర్థించాను. అప్పుడప్పుడు తమ జీతాలు పెంచాలని  డిమాండ్ చేసే ఎంపీలు సైతం దేశం కోసం జీతాలను వదులుకున్నారు.

ఇవన్నీ స్ఫూర్తినిచ్చే అంశాలు. ఈ దేశ పౌరులకు చేయి పట్టుకోవాలి... దేశంలోని ప్రతి పౌరుడిని శక్తివంతం చేయడమే మా నమూనా. ముఖ్యంగా పేదలు సాధికారత సాధించాలి. ప్రజలపై భారం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది... కానీ ఇదంత సులభం కాదు. అయితే దీన్నిఎలా అధిగమించాలి? ఉదాహరణకు మేము సుమారు 11000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాము దానిని 25000కి తీసుకెళ్లాలనుకుంటున్నాము.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ప్రశ్న : మీరు గతంలో కంటే ఇప్పుడు కేరళపై ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మీరు కేరళకు వచ్చినప్పుడల్లా సహకార రంగం మరియు ప్రజా ధనాన్ని దోచుకునే అంశంపై దృష్టి పెడతారు. వీటిపై చర్యలను ఆశించవచ్చా?  

జవాబు : మొదటి విషయం ఏమిటంటే.. బీజేపీ, జన్‌సంఘ్‌ల కాలం నుంచి మేము దేశమంతటికీ సేవ చేయాలనుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనం ఉన్న చోట పని చేయడం... రాజకీయ ప్రయోజనం లేకపోతే అక్కడ పని చేయకపోవడం అనేవి మా సూత్రాలు కావు. 1967లో కేరళలో జనసంఘ్ అతిపెద్ద జాతీయ సమావేశం జరిగింది. అంటే కేరళలో అధికారం దక్కించుకునేందుకు అలా చేసామని అర్థమా... ఎంతమాత్రం కాదు.  

మాకు కేరళ కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా సేవా ప్రాంతం... అంతే అంకితభావంతో సేవ చేస్తున్నాము. వందలాది మంది మా కార్యకర్తలు కాల్చి చంపబడ్డారు, రాజకీయ హత్యలు జరిగాయి, అయినప్పటికీ మేము 'మా భారతి'కి పూర్తి సేవా స్ఫూర్తితో సేవ చేస్తున్నాము. మా నాయకులు, కార్యకర్తల హత్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు వామపక్ష క్యాడర్‌కు శిక్ష విధించింది. చాలా మంది ఇప్పటికీ జైల్లో ఉన్నారు.

ఏది ఎలావున్నా మాకు కచ్, గౌహతి, కాశ్మీర్ లేదా కన్యాకుమారి ఏదైనా కావచ్చు... దేశంలోని ప్రతి మూలా మాదే. రెండవ విషయం ఏంటంటే మీరు త్రిపురను చూసి ఉంటారు. అక్కడ వామపక్షాలు మూడు నాలుగు దశాబ్దాలు పాలించాయి, కానీ ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో వామపక్షాలు దోపిడీ గురించి అర్థమయ్యింది.త్రిపురలో బిజెపి ఇంత మంచి పని చేస్తుందని ప్రజలు నమ్మలేదని, మరి ఇప్పుడు అక్కడ మళ్లీ మళ్లీ బీజేపీని గెలిపించడం మొదలుపెట్టారు.

అదేవిధంగా కేరళలో కూడా చాలా అవినీతి ఉంది. కానీ అక్కడి పరిస్థితులు  ఏదీ బయటకు రానివ్వకుండా వున్నాయి. అందుకే నేను ఈ ఎన్నికలకు వెళ్ళినప్పుడు సహకార సంఘాల గురించి మాట్లాడాను... ఎందుకంటే ఇది సామ్యానులను ప్రభావితం చేసే పెద్ద నేరం, కాబట్టి క్షమించలేము.

ఒక పేద కుటుంబం తమకు వడ్డీ ఎక్కువ వస్తుందనో లేక కూతురు పెద్దయ్యాక పెళ్లికి ఉపయోగపడుతుందనో బ్యాంకుల్లో డబ్బులు దాస్తారు. ఇలా మత్స్యకారులు, రైతులు, కూలీలు డబ్బులు దాచుకున్న దాదాపు 300 సహకార బ్యాంకులను వామపక్షాలకు చెందినవారు నడుపుతున్నారు. ఇలా కేరళలోని పేద ప్రజల సొమ్ము దాదాపు రూ.లక్ష కోట్లు ఆ బ్యాంకుల్లో వుంది. కానీ ఈ బ్యాంకులను నడుపుతున్నవారు పేదల డబ్బు గురించి ఆలోచించకుండా వాటితో సొంతంగా ఆస్తిపాస్తులు కొనుగోలు చేశారు.

అయితే ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాంకుపై చర్యలు తీసుకుని  సుమారు 90 కోట్ల రూపాయలను అటాచ్ చేసాము. ఆ బ్యాంకులో ఉన్న రూ.90 కోట్లను ఎలా తిరిగి పొందాలనే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నాను. 

ఈ డబ్బు ఎవరికి చెందుతుందో వారికి ఇవ్వడం ప్రారంభించాలని కూడా నేను ఈడి అధికారులను కోరాను. ప్రజల సొత్తును దోపిడీ చేస్తున్న వారి ఆస్తులను అటాచ్ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న రూ.17 వేల కోట్లను నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చాం. అందుకే కేరళలో 300 బ్యాంకులు చేసిన మోసాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాను. నాకు ఇది ఎన్నికల సమస్య కాదు, సాధారణ పౌరుల జీవితానికి సంబంధించిన సమస్య.

ప్రశ్న: ఈ ఉత్తరాది-దక్షిణ విభజన గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపణలున్నాయి. దీనిపై కేరళ సుప్రీంకోర్టులో కేసు వేసింది. కర్నాటక ప్రభుత్వం కూడా తాము కేంద్రానికి ఇచ్చే మొత్తంతో పోల్చితే తమకు తిరిగి వచ్చేది చాలా తక్కువగా వుంటోందని నిందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణాది ప్రత్యేక దేశం అవుతుందా...?

జవాబు : మనమందరం భరతమాత సంక్షేమం కోసం ఉన్నది... రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వమైనా ఇదే బాధ్యత...  140 కోట్ల దేశప్రజలదీ ఇదే బాధ్యత. ఈ వ్యవస్థలో వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు పద్దతులుంటాయి. కానీ మనందరి, భారత ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే...   కేరళలోని ఏ గ్రామానికి చెందిన వ్యక్తి అయినా పథకాల ద్వారా ప్రయోజనం పొందాలి...కర్ణాటకకు చెందిన వ్యక్తి కూడా ఈ ప్రయోజనం పొందాలి. ఇది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్ఫూర్తి.  హిమాలయాల నుండి నదులు ప్రవహిస్తున్నాయి... కాబట్టి ఈ నీరు నాకు మాత్రమే సొంతమని హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అంటే... అప్పుడు దేశం మనుగడ సాగుతుందా? ఇక్కడ ఏదో ఒక చోట బొగ్గు గనులున్నాయనుకుందాం...  ఈ బొగ్గు బయటకు వెళ్లకూడదంటే మొత్తం అంధకారంలో కూరుకుపోవడం ఖాయం. ఈ ఆలోచన సరికాదు.

ఆస్తులు మొత్తం దేశానికి చెందినవి... మనం దేనికి యజమానులం కాదు. అలాగే ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. ఏ ప్రభుత్వమూ తన ఇష్టానుసారం ఏమీ చేయదు. 14వ ఆర్థిక సంఘం రాగానే ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కేంద్రం నుండి రాష్ట్రాల వాటాను 32 శాతంగా నుండి 42కి పెంచారు. అయితే ఇలా 42 శాతం కుదరదని... దీంతో ఈ దేశం నడవదు అని అన్నివైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. మీరు ప్రభుత్వాన్ని నడపలేరు... విఫలమవుతామని అన్నారు. ప్రభుత్వంతానికి 10 అంశాల్లో కేవలం 5 లేదా 3 లేదంటే 10కి పది అంశాలను స్వీకరించే హక్కు వుంటుంది. ఈ  విషనం తనవరకు వచ్చిపుడు రాష్ట్రాల వాటా పెంచడం కేంద్రానికి భారం అవుతుందని...  ప్రభుత్వాన్ని నడపడమే కష్టం అవుతుందని అధికారులు హెచ్చరించారు. ఇలా ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. కానీ నేను చెప్పాను... ఇక్కడనుండే ప్రారంభిద్దాం... రాష్ట్రాలపై నాకు నమ్మకం వుంది. అన్నిరాష్ట్రాలు చాలాబాగా పనిచేస్తున్నాయి. కాబట్టి నిధులు రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్లనివ్వండని చెప్పా.  ఇలా 32 శాతం నుండి 42 శాతానికి ఆదాయ పంఫిణీ పెంచాలన్న ఫైనాన్స్ కమీషన్ నిర్ణయాన్ని అంగీకరించాం... సిపార్సులను యధాతధంగా ఆమోదించాము.

యూపీఏ పాలనలో...  మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు రిమోట్ ప్రభుత్వం నడుస్తుండేది. ఆ పదేళ్లలో కర్నాటకకు రూ.80000 కోట్లు వచ్చాయి.. కానీ మా ప్రభుత్వం ఈ పదేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్లు ఇచ్చింది. యూపీఏ హయాంలో కేరళకు రూ.46000 కోట్లు ఇచ్చారు. మా ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు ఇచ్చింది.

యూపీఏ హయాంలో తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రూ.95000 కోట్లు ఇచ్చారు. కేరళకు చెందినవారు కూడా ఆనాటి ఎన్డీఏ పాలనలో భాగస్వాములు... అప్పుడు మేమేమీ లేము. నేడు తమిళనాడుకు రూ.2.90 లక్షల కోట్లు వచ్చాయి. ఈ లెక్కలు ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి వారి వెనక కాంగ్రెస్ వుంది.  5-6 దశాబ్దాలుగా దేశాన్ని నడిపిన కాంగ్రెస్ కూడా ఇలాంటి ఆరోపణలు చేసేవారితో వుండట విచారకరం.

ప్రశ్న: భారతదేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజిస్తూ చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కర్ణాటకకు చెందిన ఓ ఎంపీ దేశాన్ని విభజించాలని మాట్లాడారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇలాంటి కామెంట్స్ ను మీరెలా హ్యాండిల్ చేస్తారు?

జవాబు : దేశంలోని రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగానికి లోబడి వుండాలి. భారత రాజ్యాంగం మనందరికీ దేశాన్ని ఐక్యంగా వుంచి సమగ్రతను కాపాడే బాధ్యతను అప్పగించింది. ఎవరైనా నాయకుడు దేశాన్ని విభజించాలంటూ మాట్లాడితే ఆ రాజకీయ పార్టీని చాలా సీరియస్‌గా తీసుకోవాలి.

ఒకటి రెండు సార్లు ఇలా మాట్లాడారని భావిస్తే పొరపాటే... ఎవరికి తెలుసు ఇలాంటి విత్తనానికి నీరు లభించి వేళ్లూనుకుపోయి పెద్ద వృక్షంగా మారితే. కాబట్టి ఇలాంటి విద్వేష, స్వార్థపూరిత కామెంట్స్ కు దూరంగా వుండాలి. దేశానికి పెను నష్టం వాటిల్లే ఇలాంటి ఆలోచనలు మంచివికావు. 

నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అన్యాయాలు ఎదుర్కొన్నాను. అన్ని రకాల అన్యాయాలు జరిగాయి, కానీ నేను ఒకే ఒక మంత్రాన్ని నమ్మాను... దానిని బహిరంగంగా ఉపయోగించాను... భారతదేశ అభివృద్ధి కోమే గుజరాత్ అభివృద్ధి అని. మనమందరం కలిసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఎలాంటి రాజీ పడకూడదు.

prime minister Narendra Modi exclusive interview with Asianet News

ప్రశ్న : కర్ణాటకలో కరువు ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణలతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీని గురించి మీరేమంటారు?

జవాబు : చూడండి.. ఇది మన కాలం నుండి కాదు... చాలా కాలం నుండి కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విపత్తు వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. ఏదైనా ప్రాంతంలో విపత్తు సంభవించినట్లయితే దానిని చాలా సున్నితంగా తీసుకోవాలి. అక్కడి ప్రభుత్వం నష్టపోతుందని అనుకోకూడదు... విపత్తు సంభవించినప్పుడు  ప్రభుత్వం కంటే ప్రజలే ముందుగా బాధితులవవుతారు. కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యతల పాలకులుగా మనదే. 

ఇది రాజకీయ ఆటస్థలం కాదు... అలా ఉండకూడదు. అందుకే కర్ణాటక పరిస్థితి తెలియగానే సకాలంలో ఎస్‌డిఆర్‌ఎఫ్, రూ.900 కోట్ల నిధిని పంపించాము. ఎలాంటి బకాయిలు పెట్టలేదు. అంతే కాకుండా ప్రకృతి వైపరీత్యాల కోసం మంత్రిత్వ శాఖ బృందం ఉంది... ఇది ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సర్వే చేస్తుంది. ప్రభుత్వం తన పిటిషన్‌ను ఇస్తుంది.., దీన్ని ఓ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో నిపుణులతో కూడా వుంటారు. అందరూ కలిసి కరువు పరిస్థితి ఎలా వుందో నిర్ణయిస్తారు... ఎక్కువగా నిధులు అవసరమయ్యే ప్రత్యేక పరిస్థితి ఉంటే అలాగే చేస్తాం. ఇటువంటి విపత్కర సమయంలో మేము మరింత సహాయం చేయాలనుకుంటున్నాం... కాబట్టి మాకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసాం.   అయితే ఈ రోజుల్లో రాజకీయ లబ్ధి పొందడం ఫ్యాషన్‌గా మారింది... అందుకోసమే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళి సహాయం అందకుండా  అడ్డంకులు సృష్టిస్తున్నారు.   కేరళ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది... వాళ్లు ఎలాంటి తిట్లదండకం అందుకున్నారో చూడండి. సుప్రీం కోర్టు వారిని ఎంతగా తిట్టిందో, ఎంతగా అవమానించింది.   పొలిటికల్ మైలేజ్ కోసం వారు ఏమైనా చేస్తారు... కానీ నిజం ఏమిటో తెలుసు. దేశానికి ఎలాంటి నష్టం కలగకుండా మీడియా నిజాన్ని ప్రజల ముందుంచాలని నా నమ్మకం. భారత ప్రభుత్వ మేలు కోసమో, రాష్ట్ర ప్రభుత్వ మేలు కోసమో కాదు.... ప్రజల మేలు కోసం పనిచేయాలి.

ప్ర) మధ్యతరగతి వారికి ఆరోగ్య సంరక్షణ పెద్ద సమస్య. మీరు కూడా చాలా చేసారు. మేము ఉన్న చోట మీరు సంతృప్తి చెందారా?

సమాధానం :  మోడీ సంతృప్తి చెందిన రోజు, రాసి పెట్టుకోండి.. మీరు ఆయనకు నివాళులర్పించాలి. నేను అసంతృప్తిని కొనసాగిస్తూనే ఉన్నాను. నాలో తృప్తి రావడానికి నేను ఎప్పుడూ అనుమతించను. నేను ఆ అసంతృప్తిని పెంచుకుంటాను. ఎందుకు? తద్వారా నేను కొత్తగా ఏదైనా చేయాలనే స్ఫూర్తిని పొందుతాను.

నేను చేయాల్సింది చాలా ఉంది. ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, పేద కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించడం నాకు చాలా ముఖ్యం. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. అత్యుత్తమ ఆసుపత్రుల్లో 60 కోట్ల మందికి పైగా ప్రజలకు అత్యుత్తమ చికిత్స అందించడమే మా లక్ష్యం. కేరళకు చెందిన వ్యక్తి అహ్మదాబాద్ వెళ్లి అక్కడ అనారోగ్యం పాలయ్యాడు అనుకుందాం, అప్పుడు అతను మోడీ కార్డును చూపించి, అక్కడ చికిత్స పొందుతాడు. 2014-15లో సగటున ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై తన జేబులోంచి 62 శాతం ఖర్చు చేయాల్సి వచ్చింది. నేడు అది 47 శాతానికి తగ్గింది.

2014-15 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి తలసరి ఖర్చు రూ.1100. నేడు ఆరోగ్య రంగానికి తలసరి వ్యయం దాదాపు రెండు రెట్లు పెరిగింది. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా, ప్రభుత్వం ఖర్చు చేసినందున లబ్ధిదారులు దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఆదా చేశారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ఏ పౌరుడైనా ఇప్పుడు ఆయుష్మాన్ కార్డును పొందుతారు. అతని చికిత్సకు భారత ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది.

2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నేడు ఇది 706కు పెరిగింది. 2014లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 51,000. ఇప్పుడు అవి లక్షకు పైగా పెరిగాయి. వైద్యుల సంఖ్య పెరిగితే గ్రామాల్లో మంచి వైద్యం అందుతుంది. అంటే ఆరోగ్య రంగాన్ని మేం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాం.

నరేేంద్ర మోదీతో ఏసియానెట్ న్యూస్‌ ఇంటర్వ్యూ పార్ట్ 2

 

 

Follow Us:
Download App:
  • android
  • ios