Asianet News TeluguAsianet News Telugu

ఇలాగే అయితే గ వర్నర్లకు అన్నం కూడా పెట్టరు, కరెంటూ పీకేస్తారు - Asianet Newsతో ప్రధాని మోదీ

Summery: ప్రధాని నరేంద్ర మోదీ ఏసియానెట్ న్యూస్ కి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 82 నిమిషాల పాటు దేశంలోని రాజకీయ, అభివృద్ధి, ఇతర కీలక అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్వూలొ ఇది రెండో భాగం.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2
Author
First Published Apr 20, 2024, 8:29 PM IST

ప్రధాని మోదీతో ఏసియానెట్ న్యూస్ ఇంటర్వ్యూ పార్ట్ 1 ని ఇక్కడ చదవచ్చు ఇది ఇంటర్వ్యూ రెండో భాగం.

ప్రశ్న) బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి... దీనిపై చాలా చర్చ జరుగుతోంది. మరి దీనిపై మీరేమంటారు?    

సమాధానం : 5-6 దశాబ్దాలు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న వారిని అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం  మన శత్రు దేశమైనా, వ్యతిరేకించే దేశమైనా లేదంటే మనల్ని గౌరవించే దేశమైనా... అక్కడ మన దేశ వ్యవస్థలను జాగ్రత్తగా చూసుకుంటున్నాయి.  భద్రత, సౌకర్యాలతో పాటు అన్నీ వారే చూసుకుంటారు. చివరకు శత్రు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు, అందులో పనిచేసే బృందాలకు భద్రత కల్పించడంతో పాటు గౌరవం ఇస్తారు. 

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

ఇది నా దేశం.  ఇక్కడ గవర్నర్ పదవి రాజ్యాంగబద్దంగా ఏర్పడింది. కాబట్టి గవర్నర్లను గౌరవించడం, ఆత్మగౌరవాన్ని కాపాడటం ఆ రాష్ట్రాల బాధ్యత కాదా? కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? ఇక్కడ కేరళలోనే గవర్నర్ ఎయిర్ పోర్టుకు వెళుతున్నపుడు వామపక్షాలు వచ్చి హంగామా సృష్టించాయని ఊహించుకుందాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా సరిపోతుంది? 

ఎక్కడో ఏదో న్యూస్ పేపర్లో కాలమ్ చదివాను. మన గవర్నర్ చాలా విషయాలను మౌనంగా సహిస్తారు... అలాంటి వాటి గురించి మాట్లాడరని. కానీ కేరళలో గవర్నర్ అవసరాలకు కేటాయించాల్సిన నిధులను నిలిపివేసారు... చివరకు భోజనానికి అవసరమయ్యే నిధులు కూడా లేకుండా చేసారు.  ఇప్పుడు కూడా మేల్కొని మాట్లాడకుంటే రేపు విద్యుత్ కూడా నిలిపివేస్తారు.  

నాకు గుర్తుంది ఒకసారి మహారాష్ట్రలో గవర్నర్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వంఅతనికి హెలికాప్టర్ ఇవ్వలేదు. గవర్నర్ కు ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమం ఉంది... కానీ చివరి క్షణంలో దానిని రద్దు చేయాల్సి వచ్చింది. ఇకతమిళనాడులోని గవర్నర్ నివాసం రాజ్ భవన్ బయట పెట్రోల్ బాంబులు విసిరారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోతుందా? రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాలి.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

నేను రాష్ట్రంలో ఉన్నపుడు కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్లుగా వుండేవారు. కానీ నాకు వారితో ఎప్పుడూ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. నేను వారిని గౌరవించాను, వారు నన్ను గౌరవించారు. ఈ సాందప్రదాయమే చాలాకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఇలాంటి రోజులు రావడం బాధాకరం.

ప్రశ్న) కేరళలో అడుగుపెట్టేందుకు బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ పట్టు సాధించలేక పోతోంది.  ఎందుకంత కష్టంగా మారింది? 

సమాధానం : కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రజాసేవ చేయడంలేదు. మీరే చూస్తున్నారు గతంలో కేరళలో ఎప్పుడు విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేవారు మా వాళ్లే. కాబట్టే కేరళలో వామపక్షాలు పట్టు కోల్పోతున్నాయి... అక్కడి ఓటర్లు మోసం చేస్తున్నారని గ్రహించారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. 

తమిళనాడులో ఎల్‌డిఎఫ్-యుడిఎఫ్ కలిసాయి... కానీ కేరళలో ఎల్‌డిఎఫ్-యుడిఎఫ్ ముఖాముఖి పోటీకి దిగాయి.  ఇప్పుడు ఏషియానెట్ తమిళనాడులో వాళ్లు కలిసి ఉన్నారని... ఇదే ఏషియానెట్ కేరళలో వారిమధ్యే పోటీ వుందని వార్తలు ఇస్తారు. కాబట్టి వారిపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు 6 శాతం ఓట్లు వచ్చాయి. 2014 తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 15 శాతం ఓట్లు వస్తున్నాయి. అంటే మనం నిరంతరం పురోగమిస్తున్నామని అర్థం. కానీ అది ఒక్కటే ప్రమాణం కాదు. అక్కడి ప్రజలకు ఎలా సేవ చేస్తున్నామో పూర్తి స్థాయిలో చేస్తున్నాం, అలాగే కొనసాగిస్తాం.

సుపరిపాలన కు తప్పుడు సమాచారానికి మధ్య యుద్ధం ఉందని నేను నమ్ముతున్నాను. వారు కోవిడ్ 19 లో చాలా విజయాలు సాధించారని కథనాన్ని సృష్టించారు. అయితే చాలా మంది ప్రజలు అక్కడే మరణించారు. వాళ్ళు మీడియాను నియంత్రించడం ద్వారా తమకు అనుకూల ప్రచారం చేస్తారు... ఇది క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా వుంటుంది.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

ప్రశ్న: కేరళలో క్రైస్తవ మైనారిటీలకు చేరువ కావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ఆశించిన స్థాయికి చేరుకోవడం లేదు. దీనిపై మీరు ఏమి చెబుతారు?

జవాబు : బిజెపి సమాజంలోని అన్ని వర్గాలను తన వెంట తీసుకెళ్లే పార్టీ. సమాజంలోని ప్రజలందరినీ వెంట తీసుకెళ్లడమే మా ప్రాథమిక సూత్రం. ఇప్పుడు చూడండి... మన ప్రభుత్వం గోవాలో చాలా దశాబ్దాలుగా అధికారంలో వుంది...  ఇది క్రైస్తవుల సహాయంతోనే సాధ్యమయ్యింది. 

ఈరోజు ఈశాన్యం భారతదేశంలో చూడండి, అక్కడ చాలా చోట్ల బిజెపి ప్రభుత్వాలు వున్నాయి... కొన్నిచోట్ల ముఖ్యమంత్రుగా వుంటే మరికొన్నిచోట్ల మంత్రివర్గంలో క్రైస్తవులు ఉన్నారు. అంటే అక్కడ క్రైస్తవులు అధికంగా ఉన్నారని  అర్థం అవుతుంది.. వారి ఓట్లతోనే మన ప్రభుత్వం ఏర్పడుతుంది. వారు మాకు మద్దతు ఇవ్వడం లేదని నేను నిందించలేను. కాబట్టి మేము మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.

ఇప్పుడు, కేరళలోని బూత్ నుండి జాతీయ స్థాయి వరకు మా నాయకత్వంలో క్రైస్తవ మిత్రులు ఉన్నారు. క్రైస్తవ నాయకులు, బిషప్‌లు నన్ను సంవత్సరానికి 5 నుండి 6 సార్లు కలుస్తారు. నేను కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటాను. ఎల్‌డిఎఫ్-యుడిఎఫ్ అబద్ధాలతో క్రైస్తవ సమాజం విసిగిపోయింది... చర్చిల మధ్య చాలా వివాదాలకు ఆ పార్టీలే కారణమయ్యారు...  దీంతో చాలామంది నా వద్దకు వచ్చి వారిపై ఫిర్యాదు చేశారు. మా చర్చి ఆస్తి చాలా ప్రమాదంలో ఉంది.., దయచేసి సహాయం చేయండని వారు నన్ను కోరారు. భారత ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారు. అలాగే చాలా చర్చి అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి..దీనిపై మాకు ఆందోళన వుంది. 

మత్స్యకారుల విషయమే చూడండి... తీరప్రాంత ప్రజలకు సహాయం చేయడానికి నేను ప్రత్యేక మత్స్య శాఖను సృష్టించాను. ఇప్పుడు వాళ్లు దానిని స్వాగతించారు. నా ప్రయత్నం ఏమిటంటే... ఇలాంటి ప్రయత్నాల ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడాలి. ఆధునిక సాంకేతికత యొక్క ప్రయోజనాన్ని అందరూ పొందాలి. ఈ ప్రయత్నాలు బ్లూ ఎకానమీ ప్రాంతంలో, మత్స్యకార సమాజంలోని ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. క్రైస్తవ సమాజానికి ఆరోగ్యం మరియు విద్య రంగాలతో సంబంధం ఉంది. నేను వాటికన్ వెళ్ళినప్పుడు పోప్‌తో సుదీర్ఘంగా చర్చించాను... నా ప్రభుత్వ పనితీరు గురించి ఆయనవద్ద చాలా సమాచారం వుంది. మేము చాలా విషయాలు చర్చించాము... నేను ఆయనను భారతదేశానికి రావాలని కోరాను. బహుశా వచ్చే సంవత్సరం ఆయన భారత్ కు రావచ్చు.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

ప్రశ్న: కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు ఆయన కుటుంబం బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో మీరు మెతక వైఖరి అవలంభిస్తున్నారని కాంగ్రెస్, యూడీఎఫ్ ఆరోపిస్తున్నాయి. దీనిపై మీరు ఏం చెబుతారు?

సమాధానం : మోడీ మెత్తగా లేదంటే కఠినంగా ఉన్నా ప్రయోజనం లేదు. దర్యాప్తు సంస్థలు తమ పనిని స్వతంత్రంగా చేస్తాయి... వాటి పనిలో నా ప్రభుత్వం గానీ,  ప్రధాన మంత్రి గానీ జోక్యం చేసుకోకూడదు. అది నా సిద్ధాంతం. కాంగ్రెస్, కమ్యూనిస్టుల విషయానికొస్తే... నేను ఒకే నాణేనికి రెండు వైపులని అంటాను. పినరయి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మేం ఎప్పుడూ బయటపెట్టాం. ఏప్రిల్ 15న బంగారం స్మగ్లింగ్ కేసును లేవనెత్తాం. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ రాచరిక రాజకీయాలు, అవినీతి పాలన గురించి ఆరోపణలు చేయలేదు. నేడు, ఈ రెండు అంశాలను కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఇతరులను వదిలివేసింది. అంటే బీహార్‌లో కొంతమంది అపఖ్యాతి పాలైన రాజకీయ నాయకులతో పోలిస్తే, కేరళ కమ్యూనిస్ట్ పార్టీలో బంధుప్రీతి పరిస్థితి దారుణంగా ఉంది.

సీపీఎం కో-ఆపరేటివ్ బ్యాంకును లూటీ చేసింది... దాన్ని బయటపెట్టాం... రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులేమో తప్పుచేసిన వారిని  జైల్లో పెట్టమంటోంది... మనం జైల్లో పెడితే ఢిల్లీకి వచ్చి రాజకీయ నాయకులపై పగబట్టే భావంతో పని చేస్తున్నామని స్టేట్ మెంట్ ఇస్తారు. ఇప్పుడు రెండు రకాలుగా మాట్లాడే వారిని దేశం ఎన్నటికీ అంగీకరించదు.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

ప్రశ్న : కేరళలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రధానమంత్రి ఫోటోపై అభ్యంతరం ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఇందులో లబ్ధిదారులను అవమానించినట్లు వుంది... దీనిపై మీరు ఏమి చెబుతారు?

జవాబు : ఎలాంటి ఫోటోలతో ఈ పథకానికి సంబంధం లేదు. పథకం పేరు పీఎం ఆవాస్ యోజన మాత్రమే. దీనిపై ప్రభుత్వ లోగో ఉంది కాబట్టి దానికి గుర్తింపు దక్కింది.  పథకాల పేరుతో భారత ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించింది. మీరు ఇక్కడ పేరు మార్చుకుంటే అసలు కేరళలో పిఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టలేదని నాకు ఆడిట్ నివేదిక వస్తుంది. డబ్బులు ఎలా ఇచ్చారంటే ఏం చెప్పను. నేను CAGకి ఏ నివేదిక ఇస్తాను?. కాగ్ ఆడిట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితమైన కారణం కోసం పార్లమెంటు నాకు ఖర్చు చేయడానికి హక్కు ఇచ్చింది... డబ్బును ఖర్చు చేయడం నా బాధ్యత. ఏ పథకంలోనూ మా పేరు వుండాలని కోరుకోవడం లేదు... ప్రధాన  మంత్రి అని మాత్రమే పేర్కొంటున్నాము. ఉదాహరణకు అటల్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన రూపొందించబడింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చింది... అప్పుడు కూడా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అలాగే కొనసాగింది. కాబట్టి పీఎం అంటే ఒక వ్యక్తి కాదు, అతను ఒక వ్యవస్థ. దాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారంటే మీలో ఎంత ద్వేషం, నిరాశ ఉందో అర్థం చేసుకోవచ్చు. చక్కటి స్టిక్కర్ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? వారు ఎందుకు ఉద్రిక్తత సృష్టిస్తారు?

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారాన్ని పొందాయి. వారు తమ పథకాలను అమలు చేయగలరు... ఎవరు నిరాకరిస్తున్నారు? అందువల్ల మన సహకార సమాఖ్య విధానంలో ఇద్దరికీ బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఈ బాధ్యతలు నెరవేరవని కేరళ భావిస్తోంది.

 మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కోసం ఈ ప్లాన్ చేసాము. ఆ పనికి బడ్జెట్‌లో డబ్బులు కేటాయించాం. ఇప్పుడు గుడి రాయబోమని కేరళ చెప్పింది. దేవాలయం అంటే పూజా మందిరం కాదు. మీరు బరోడా వెళ్లండి, అక్కడ హైకోర్టును టెంపుల్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఇక్కడ పూర్వం ప్రాథమిక పాఠశాలను బాల మందిర్ అని పిలిచేవారు. ఇప్పుడు బాల్ మందిర్ ప్రార్థనా స్థలం కాదు. కాబట్టి ఇది సాధారణ పదజాలం... కానీ మేము దీన్ని పలకమని వారు అంటున్నారు. ఈ పద్ధతి  ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తోంది.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

ప్రశ్న : మీరు మిడిల్ ఈస్ట్ దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. వారు కూడా మిమ్మల్ని గౌరవించారు. ఇంతకు ముందెన్నడూ ఇలా ఎందుకు జరగలేదు?

జవాబు : పశ్చిమాసియాతో మన సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై గత ప్రభుత్వాలు ఏనాడూ దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం. గతంలె మనం రెండు పనులు మాత్రమే చేసేవాళ్ళం.... ఒకటి చమురును దిగుమతి చేసుకోవడం... రెండోది తక్కువ ధరకు మానవశక్తిని ఎగుమతి చేయడం. ఇది సరైన పని కాదు.

కానీ నేడు విక్రేతలు, వినియోగదారులుగా మా బంధం బలంగా వుంది. సమగ్ర అభివృద్ధి దిశగా మా ప్రయనం సాగుతోంది. ఇప్పుడు మేము యూఏఈ తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాము. అంటే ఈ రోజు మనం ఈ మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీని చేస్తున్నాం. నేడు మనం సాంకేతికత మరియు సేవలను కూడా ఎగుమతి చేస్తున్నాము. మన విశ్వవిద్యాలయాలు అక్కడ పని చేయడం ప్రారంభించాయి. వ్యవసాయోత్పత్తులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నాం.

నేను ప్రధాని అయిన తర్వాత 2015లో యూఏఈకి వెళ్లాను... దేశానికి చెందిన 25-30 లక్షల మంది నివసించే దేశమది. కానీ గత30 ఏళ్లుగా ఆ దేశాన్ని భారత ప్రధాని సందర్శించలేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇటువంటి పరిస్థితిలో  అక్కడ నివసిస్తున్న నా భారతీయ సోదర సోదరీమణులకు ఎలాంటి గౌరవం లభిస్తుంది? కాబట్టి కేరళకు చెందిన నా సోదరులు ఎక్కడ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారో తెలుసుకుని వారి గురించి తెలుసుకునేందుకు వెళ్లాను.

నేను గత 10 సంవత్సరాలలో 13 సార్లు మిడిల్ ఈస్ట్‌కి వెళ్లాను. ఇప్పుడు కోవిడ్ 19 సమయంలో భారతీయులను ఈ దేశాలు సొంత సోదరుల్లా చూసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ దేశాలు సందేశం పంపాయి. మోదీజీ డోంట్ వర్రీ... మీ వాళ్లను మేము చూసుకుంటామని చెప్పారు. ఇలా నా చర్యల వల్ల భారత పౌరులు ప్రయోజనాన్ని పొందారు.

ఇప్పుడు యెమెన్‌లో చాలా భారీగా బాంబు దాడి జరుగుతోంది. మేము అక్కడ నుండి 5000 మందిని ఖాళీ చేయించాం. ఆ దేశాలతో సత్సంబంధాల వల్లనే నేను బాంబు దాడిని ఆపి వారిని వెనక్కి తీసుకురాగలిగాను. 2023లో సుడాన్‌లో రెండు సైన్యాలు అంతర్గతంగా పోరాడుతున్నప్పుడు కూడా మేము భారతీయ పౌరులను అక్కడినుండి తీసుకురాగలిగాం. 

సౌదీ జైళ్లలో కేరళకు చెందిన 850 మంది ఉండేవారు... నేను సౌదీ నాయకులతో మాట్లాడాను... నా అభ్యర్థన మేరకు వారు భారతీయులను నిర్దోషులుగా ప్రకటించారు... వాళ్లంతా దేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఖతార్‌లో 8 మంది నేవీ అధికారులకు మరణశిక్ష విధించగా మేము కాపాడాం. అందరినీ క్షమించినందుకు అక్కడి రాజుకి నేను కృతజ్ఞుడను. కాబట్టి ఇది మన సంబంధాల బలం.

హజ్ తీర్థయాత్ర విషయానికి వస్తే... సౌదీ రాజు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ జనాభా చాలా ఎక్కువ... కాబట్టి మా ముస్లిం సోదర సోదరీమణులకు హజ్ కోసం కోటా పెంచండి అని కోరాను. నా అభ్యర్థన మేరకు హజ్ యాత్ర కోసం కోటాను పెంచారు.

యుఎఇలోని భారతీయులకు అక్కడ దేవాలయం నిర్మించాలనే కోరిక ఉంది... ఇందుకోసం కొంత భూమి కావాలని నేను యూఏఈ ని అభ్యర్థించాను. భూమితో పాటు ఆలయ నిర్మాణంలో కూడా సహాయం అందించారు. ఇలా యూఏఈలో ఒక గొప్ప ఆలయం నిర్మించబడింది. ఇప్పుడు ఆ ఆలయాన్ని లక్షలాది మంది సందర్శిస్తున్నారు. ఫిబ్రవరి 2024లో ఆ ఆలయ ప్రారంభోత్సవం కోసం నేను అక్కడికి వెళ్లాను. ఇలా నన్ను గౌరవించిన దేశాలు చాలా ఉన్నాయి... ఇది నా ఒక్కడి గౌరవం కాదు... 140 కోట్ల మంది దేశప్రజల గౌరవం. కాబట్టి కేరళలోని నా సోదర సోదరీమణులు ఈ సంబంధాల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.

ప్రశ్న) ఇతర దేశాల నుండి మన ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి చేపట్టే మిషన్స్ ఎంత కష్టంగా అనిపిస్తాయి?

సమాధానం: నేడు భారతదేశానికి విశ్వసనీయత ఉంది. ప్రపంచం భారతదేశాన్ని సోదరునిగా భావిస్తోంది. ఏదైనా సంక్షోభ సమయంలో మొదటిగా ప్రతిస్పందించేది మనమే. నేను ఇప్పుడే కావేరీ ఆపరేషన్‌ పూర్తి చేశాను. కర్నాటకకు చెందిన వారు సూడాన్‌లో ఉన్నారని, వారిని అక్కడి నుంచి వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. వెంటనే వారిని వెనక్కి తీసుకొచ్చాం. ఆ పేదలు అక్కడ చాలా కష్టపడి పని చేసేవారు. వారి జీవనోపాధి ఆగిపోయి ఉంటే వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యేవి. అందుకే విదేశాంగ విధానం దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్నాం.

మా పాలసీలో మన డయాస్పోరాకు సమానమైన ప్రాముఖ్యతను ఇచ్చాము, మా ప్రవాసులకు బలాన్ని చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ సంక్షోభం వచ్చినా, పాస్‌పోర్ట్ రంగు అక్కర్లేదు. అతను భారతీయుడు అనేది మాకు ముఖ్యం. అతనిలో ప్రవహించేది భారత రక్తం. భారతీయ రక్తం ఉంటే, నేను అతని కోసం ఏమైనా చేస్తాను. అంతకుముందు, ప్రవాసులను రక్షించడం విదేశాంగ విధానంలో భాగం కాదు. మునుపటి ప్రభుత్వాలు 'ప్రజలు వెళ్లే ముందు మమ్మల్ని అడిగారా? వాళ్ళు వెళ్ళిపోయారు అనే ధోరణిలో ఉండేవి. ఇప్పుడు వాళ్ళని చూసుకోవడం నా పని. మేము ఎండ్-టు-ఎండ్ ప్లానింగ్‌తో కొనసాగుతాము.

ఇతర దేశాల ప్రజలు కూడా మన విశ్వసనీయతను చూస్తారు. ఒకసారి ఎవరైనా త్రివర్ణ పతాకంతో కవాతు చేసి, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తే, అతను ఏ దేశ పౌరుడు అని ఎవరూ అడగరు, వారు అతన్ని విడిచిపెట్టారు. 2015లో, యెమెన్ సంక్షోభం ఉన్నప్పుడు, మేము సౌదీ రాజుతో మాట్లాడాము వేలాది మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి కృషి చేసాము. ఉక్రెయిన్ సంక్షోభం ఇటీవలి వ్యవహారం. ఇటీవల ఎన్నికల అభ్యర్థికి రావాల్సిన డిపాజిట్ డబ్బులను, ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన చిన్నారులు సేకరించి ఇచ్చారు.

ఫాదర్ టామ్ కథ కేరళ ప్రజలకు తెలిసే ఉంటుంది. ఫాదర్ టామ్ చాలా కాలంగా ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్నాడు. మేము నిరంతరం దౌత్యపరంగా ప్రయత్నించాము. చాలా కాలం తర్వాత అతన్ని తిరిగి సజీవంగా తీసుకువచ్చాము.

ఆఫ్ఘనిస్తాన్‌లో క్రైస్తవుల కోసం పనిచేస్తున్న బెంగాల్‌కు చెందిన ఓ కూతురు కిడ్నాప్‌కు గురైంది. జుడిత్ డిసౌజా నెలల తరబడి ఉగ్రవాదుల కస్టడీలోనే ఉంది. మేము ఉన్న ప్రతి కనెక్షన్‌ని ఉపయోగించాము. ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చాము.

ఇదే విధంగా మరో పూజారిని తీసుకొచ్చాం. నేను అతని ఇంటికి ఫోన్ చేసి, అతను ఢిల్లీ చేరుకుంటారని అతని సోదరికి చెప్పాను, అతను ఎప్పటికీ సజీవంగా తిరిగి రాలేడని వారు భావించినందున ఆమె నమ్మడానికి సిద్ధంగా లేదు.

కాబట్టి మేము ఈ సంబంధాలను మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోము, నా దేశ పౌరులు మొత్తం ప్రపంచంలో ఉన్నారు. దేశం వారికి అండగా నిలుస్తుందని వారు భావించాలి. ఇది చాలా ముఖ్యమైనది.

ప్రశ్న) మధ్యతరగతి వారికి ఆరోగ్య సంరక్షణ పెద్ద సమస్య. మీరు కూడా చాలా చేసారు. మేము ఉన్న చోట మీరు సంతృప్తి చెందారా?

సమాధానం: మోడీ సంతృప్తి చెందిన రోజు, రాసి పెట్టుకోండి.. మీరు ఆయనకు నివాళులర్పించాలి. నేను అసంతృప్తిని కొనసాగిస్తూనే ఉన్నాను. నాలో తృప్తి రావడానికి నేను ఎప్పుడూ అనుమతించను. నేను ఆ అసంతృప్తిని పెంచుకుంటాను. ఎందుకు? తద్వారా నేను కొత్తగా ఏదైనా చేయాలనే స్ఫూర్తిని పొందుతాను.

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

నేను చేయాల్సింది చాలా ఉంది. ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, పేద కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించడం నాకు చాలా ముఖ్యం. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. అత్యుత్తమ ఆసుపత్రుల్లో 60 కోట్ల మందికి పైగా ప్రజలకు అత్యుత్తమ చికిత్స అందించడమే మా లక్ష్యం. కేరళకు చెందిన వ్యక్తి అహ్మదాబాద్ వెళ్లి అక్కడ అనారోగ్యం పాలయ్యాడు అనుకుందాం, అప్పుడు అతను మోడీ కార్డును చూపించి, అక్కడ చికిత్స పొందుతాడు. 2014-15లో సగటున ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై తన జేబులోంచి 62 శాతం ఖర్చు చేయాల్సి వచ్చింది. నేడు అది 47 శాతానికి తగ్గింది.

2014-15 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి తలసరి ఖర్చు రూ.1100. నేడు ఆరోగ్య రంగానికి తలసరి వ్యయం దాదాపు రెండు రెట్లు పెరిగింది. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా, ప్రభుత్వం ఖర్చు చేసినందున లబ్ధిదారులు దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఆదా చేశారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ఏ పౌరుడైనా ఇప్పుడు ఆయుష్మాన్ కార్డును పొందుతారు. అతని చికిత్సకు భారత ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది.

2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నేడు ఇది 706కు పెరిగింది. 2014లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 51,000. ఇప్పుడు అవి లక్షకు పైగా పెరిగాయి. వైద్యుల సంఖ్య పెరిగితే గ్రామాల్లో మంచి వైద్యం అందుతుంది. అంటే ఆరోగ్య రంగాన్ని మేం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాం.

ప్ర) కేరళలో పర్యాటక అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని మరింత ప్రోత్సహించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు?

సమాధానం: రాబోయే రోజుల్లో భారతదేశ వృద్ధికి పర్యాటక రంగం భారీ సహకారం అందించబోతోందని నేను నమ్ముతున్నాను. నేను G20 సమయంలో దీనిని చూశాను. G20 ద్వారా నా రాష్ట్రాలు ప్రపంచానికి తెలిసేలా అయ్యేలా చూడడమే నా ప్రయత్నం. నా రాష్ట్రాల బలాన్ని ప్రపంచం చూడాలనే ఆలోచన వచ్చింది. అందువల్ల, మేము దేశంలోని వివిధ ప్రదేశాలలో సుమారు 200 G20 సమావేశాలను నిర్వహించాము. కాబట్టి ప్రపంచ ప్రజలు భారతదేశం అంటే కేవలం ఢిల్లీ లేదా ఆగ్రా మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రదేశాలున్నాయని తెలుసుకున్నారు. ఈరోజు ప్రపంచంలోని ఏ దేశాధినేతలు వచ్చినా వారిని చాలా ప్రాంతాలకు తీసుకెళ్తాను. కేరళలో మనకు ఆయుర్వేదం ఉందని, అక్కడ ఏదైనా వ్యాధి నయం కాకపోతే ఇక్కడికి రావాలని నేను వారికి చెప్తున్నాను. కేరళలో అద్భుతమైన వన్యప్రాణులు, సముద్ర తీరాలు, అద్భుతమైన కొండ ప్రాంతాలు, మరెన్నో ఉన్నాయి. అయినప్పటికీ వాటిని మరింత సద్వనియోగం చేసుకోవాల్సి ఉంది.

కేరళలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. గురువాయూర్, పద్మనాభస్వామి దేవాలయం, శబరిమల, ఇలా చెప్పుకొంటూ పోతే భారతదేశంలోని పురాతన చర్చి కేరళలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి మసీదు చేరమాన్ జుమా మసీదు కేరళలో ఉంది. కేరళ మార్షల్ ఆర్ట్స్... కలరిపయట్టు; నృత్య రూపాలు... కథాకళి, మోహినియాట్టం. కేరళలో వెల్‌నెస్ టూరిజం ఉంది. కేరళను ఆయుర్వేద ఆరోగ్య కేంద్రంగా మారవచ్చు. మేము కేరళను ఎంతగానో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము, అది ప్రపంచ ప్రజలకు ఆకర్షణీయమైన కేంద్రంగా మాత్రమే కాకుండా, వారు ఒక్కసారి కేరళను తప్పక సందర్శించాల్సిన అవసరం కూడా ఉంది.

ప్రశ్న) యూత్‌తో మీకు మంచి అనుబంధం ఉంది. ఇది మీకు ఎందుకు చాలా ముఖ్యమైనది?

సమాధానం: 21వ శతాబ్దం సాంకేతికతతో నడుస్తోంది. మామూలుగా అయితే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకు మా కాలంలో ఏమీ ఉండేది కాదు. నేను ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ కాలం గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా నన్ను గేమింగ్ గురించి అడిగితే, నేను మీ సమయాన్ని వృథా చేయవద్దని  పిల్లలతో చెప్పాను. నేను వివరాలలోకి వెళ్లి అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, ఈ అవగాహన తప్పు అని నేను గ్రహించాను.

దానికి ఆంక్షలు పెట్టే బదులు దాన్ని సరైన దారిలో మళ్లించాలి. రెండవది, ప్రపంచంలోని గేమర్స్‌లో ఎక్కువ భాగం భారతీయులే. అయితే, గేమింగ్ మార్కెట్ బయటి వ్యక్తుల నియంత్రణలో ఉంది. మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ఎందుకు ఉండకూడదు? భారతదేశంలో చాలా స్టోరీలు, చాలా విషయాలు ఉన్నాయి.మరోవైపు గేమింగ్ తో మన కొత్త తరానికి చాలా విషయాలపై అవగాహన కల్పించగలము. కర్ణాటకలోనే, కొందరు నదిలోని అపరిశుభ్రత, దానిని శుభ్రపరచడం పై ఒక గేమ్ చేసారు. దీంతో ప్రజలు ఆన్‌లైన్‌లో చేరి తమ సూచనలు ఇచ్చారు. కాబట్టి, మంచి అలవాట్లు, ఆలోచనలను పెంపొందించడానికి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను వారితో కూర్చుని, వారితో సమయం గడిపాను, అర్థం చేసుకోవడానికి నేను విద్యార్థిలా ఉండాలని కోరుకుంటున్నాను. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు.

పైగా, నేను పరిమిత ఆలోచనలు ఉన్న వ్యక్తిని కాదు. నేను నా జీవితాన్ని ఆంక్షలతో గడపను. కొత్తది నేర్చుకోవడం లేదా కొత్తది ఉపయోగించడం నా స్వభావం. 2012లో, నా రాజకీయ జీవితంలో మొదటిసారిగా Google Hangout చేసాను. ఈ విషయం అప్పట్లో తెలియదు. అప్పుడు నేను 3D హోలోగ్రామ్ చేసాను. ఈ రోజుల్లో నేను AI ఉపయోగిస్తున్నాను. నాతో ఉన్న మీ ఫోటో ఎప్పుడైనా రిలీజైనట్లయితే, మీరు నమో యాప్‌లోకి వెళ్లి, AI టూల్‌ని ఉపయోగించి మీ ఫోటోను అప్‌లోడ్ చేస్తే, గత 30-40 సంవత్సరాల నుండి మీరు నాతో ఉన్న అన్ని ఫోటోలు కలిసి కనిపిస్తాయి. కంటెంట్ సృష్టికర్తలు కూడా దేశానికి భారీ ఆస్తులు. వారు ప్రపంచవ్యాప్తంగా కంటెంట్‌ని సృష్టించగలరు. వారి బలాన్ని నేను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి.

ప్ర) దేశంలో విఐపి సంస్కృతికి చాలా చరిత్ర ఉంది. దాని గురించి కూడా మాట్లాడతారా. దాన్ని ఎలా ముగించాలి? దీనిపై మీరు ఏమి చెబుతారు?

సమాధానం: ఇది చాలా ఆందోళన కలిగించే, దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, ఈ VIP సంస్కృతికి మూలం బ్రిటీష్ కాలం. బ్రిటిష్ వారికి ఒక చట్టం, సాధారణ ప్రజలకు మరో చట్టం ఉండేది. బ్రిటీష్ వారి జీవనశైలి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. బ్రిటీష్ వారు వెళ్లిన తర్వాత ఇదంతా ముగిసిపోవాలి కానీ అలా జరగలేదు. మన నాయకులు దానిని కొనసాగించారు.

నేను వచ్చినప్పుడు, నేను మొదట చేసిన పని వాహనంపై ఎర్ర బుగ్గను తొలగించడం. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు మంత్రులందరికీ తమ కార్లలో వెళ్లేటప్పుడు ఎవరూ సైరన్‌లు వినియోగించకూడదని నిబంధన ఉండేది. సైరన్‌లతో కదులుతున్న మనం చక్రవర్తులమా? నాకు అది VIP కాదు, EIP. అంటే 'ప్రతి వ్యక్తి ముఖ్యమే'. VIP సంస్కృతిని నిరుత్సాహ పరిచేందుకు ఇది నా ప్రయత్నం. ఇప్పుడు ఎవరైనా దేశాధ్యక్షుడు ఫుట్‌పాత్‌పై వెళ్లాలని కోరుకుంటే అది సాధ్యం కాదు. కానీ ఈ సంస్కృతిని చాలా వరకు అంతం చేయాలనేది మా ప్రయత్నం. కరోనావైరస్ కు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ కొనసాగుతున్నప్పుడు - అది జీవనర్మరణ సమస్య- నేను కూడా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ నిబంధనల ప్రకారం నా వంతు వచ్చిన రోజున వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను అప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు.

మా అమ్మకి 100 ఏళ్లు నిండాయి. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది. ఆమె అంత్యక్రియలు కూడా ప్రభుత్వ శ్మశానవాటికలోనే జరిగాయి. వీలయినంత వరకు వీఐపీ సంస్కృతిని విస్మరిస్తాను. రిపబ్లిక్ డే పరేడ్‌లో, సెంట్రల్ విస్టాను నిర్మించిన వారిని నేను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాను. నేను కాన్వకేషన్ కోసం యూనివర్సిటీకి వెళ్లినప్పుడల్లా, మొదటి 50 సీట్లు నా అతిథులకు అని నేను వారికి చెప్తాను. దీని తరువాత, నేను ఆ విశ్వవిద్యాలయం సమీపంలోని పాఠశాలలు, మురికివాడల పిల్లలను కాన్వకేషన్‌కు తీసుకువెళతాను. ఆ సమయంలో నేనూ తగిన పరిస్థితికి డ్రెస్ వేసుకుని డిగ్రీ తెచ్చుకుంటాను.

ఇంతకు ముందు పాఠశాలలో ప్రవేశానికి ఎంపీల కోటా ఉండేది, దానిని రద్దు చేశాను. హజ్ యాత్రకు కోటా కూడా ఉంది, దాన్ని కూడా ఖతం చేశాం. నేను పార్లమెంటు క్యాంటీన్‌కు సబ్సిడీని ముగించాను. ఇప్పుడు ఎంపీలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ రోజుల్లో పద్మశ్రీ పురస్కారం ప్రశంసలు పొందింది ఎందుకంటే నేను అలాంటి వారికి పద్మ అవార్డులు ఇచ్చేలా చూస్తున్నారు. నేను ఈ అవార్డును ప్రజల  అవార్డుగా మార్చాలనుకుంటున్నాను. కాకపోతే ఇంతకుముందు చాలా వరకు పద్మ అవార్డులు ఢిల్లీలోని రాజకీయ నాయకులకు తెలిసిన వారికే ఇచ్చేవారు. ఇలా చూస్తే.. ఇది ఒక పెద్ద సంస్కరణ. మీరు తప్పక మన్ కీ బాత్ వినే ఉంటారు, నేను ఆ చిన్న వ్యక్తుల జీవితాలను వివరించి ప్రపంచానికి తెలియజేస్తాను. నా దేశం, ఇది చాలా బలమైనది. 

ప్రశ్న) ఎన్నికల ప్రచారంలో మా కోసం ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.

సమాధానం: నేను ఏసియానెట్ న్యూస్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో అత్యంత కీలకమైన ఛానెల్‌తో మాట్లాడే అవకాశం వచ్చింది. నేను నా అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నించాను. నేను ఓటర్లకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను -- ఎన్నికలను తేలికగా తీసుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు. బయట చాలా వేడిగా ఉంది, అయితే మీ ఓటు మీరు వేయండి. ఎన్నికల సమయంలో ఫీల్డ్‌లో పనిచేసే అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు మరియు మీడియా ప్రతినిధులకు నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు చాలా నీరు త్రాగాలి, తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.

ఏసియానెట్ న్యూస్ Exclusive interviewని ఇక్కడ చూడండి (వీడియో)

 

Follow Us:
Download App:
  • android
  • ios