Asianet News TeluguAsianet News Telugu

ముంబాయిలో ఘోరం.. ఏడో తరగతి బాలికను క్లాస్ రూమ్ లో బంధించి, అత్యాచారం చేసిన తోటి విద్యార్థులు

ఏడో తరగతి చదివే బాలికపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. క్లాస్ రూమ్ లో ఆమెను బంధించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబాయిలో జరిగింది. 

Horrific incident in Mumbai.. Seventh class girl was trapped and raped by fellow students in the class room
Author
First Published Dec 2, 2022, 1:11 PM IST

ముంబైలో దారుణం వెలుగు చూసింది. ఏడో తరగతి చదివే బాలికపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. క్లాస్ రూమ్ లోకి లాక్కెల్లి అక్కడే ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఆ సమయంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. దీనిని నిందితులు సద్వినియోగం చేసుకున్నారు.

75 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం, హత్య.. మరణశిక్ష విధించిన మహిళా కోర్టు

వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పాఠశాలలో సోమవారం వార్షిక కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కార్యక్రమం జరిగే ఆడిటోరియం వద్ద ఉన్నారు. అయితే అదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక కూడా ఆడిటోరియానికి వెళ్లేందుకు బయలుదేరింది. దీంతో అదే పాఠశాలకు చెందిన 13-14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు బాలురు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమెను క్లాస్ రూమ్ కు లాక్కెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

అనంతరం బాలిక ఇంటికి చేరుకుంది. అయితే బాధితురాలికి తన ప్రైవేట్ పార్ట్స్ లో నొప్పి వేసింది. దీంతో ఏం జరిగిందని తల్లి ఆరా తీయడంతో తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించింది. బాధితురాలి తల్లి వెంటనే పాఠశాల పరిధిలోకి వచ్చే మాతుంగా పోలీసులను ఆశ్రయించారు. తన బిడ్డపై అత్యాచారం జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఆ శృంగార వీడియో వ్యాప్తిని తక్షణమే అడ్డుకోండి.. ఆదేశించిన హైకోర్టు.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరంటే...

దీంతో పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలురపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 376 డీఏ (పదహారేళ్లలోపు మహిళపై సామూహిక అత్యాచారం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలురను జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి పోలీసులు నిందితులను దక్షిణ ముంబైలోని డోంగ్రీలోని బాల్య నిర్బంధ కేంద్రానికి పంపించారు.

కోల్ కత్తాలో దారుణం.. మహిళపై ముగ్గురు బంగ్లాదేశీయుల సామూహిక అత్యాచారం.. 

ఆగస్టులో కూడా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందుతుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. బాధిత బాలిక పొలంలో ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలిక తన తల్లిదండ్రులకు విషయం వివరించగా.. వారు పోలీసులను ఆశ్రయించారు. దీతంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 19 నుంచి 33 సంవత్సరాల వయస్సు ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు నిందితుడైన బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios