Asianet News TeluguAsianet News Telugu

75 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం, హత్య.. మరణశిక్ష విధించిన మహిళా కోర్టు

2019లో ఓ వృద్ధురాలిపై 26 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 

A woman's court sentenced a young man to death in the case of rape of a 75-year-old woman
Author
First Published Dec 2, 2022, 12:06 PM IST

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. మూడేళ్ల కిందట కూడా ఓ వృద్ధురాలి యువకుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు. అయితే ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.

ఆ శృంగార వీడియో వ్యాప్తిని తక్షణమే అడ్డుకోండి.. ఆదేశించిన హైకోర్టు.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరంటే...

తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలో 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 26 ఏళ్ల యువకుడికి మహిళా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన జి కవిదాస్ జేసీబీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అతడు గడిచిన ఐదేళ్లలో మరో ఐదుగురు మహిళలను కూడా అత్యాచారం చేసి, హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసుల్లో కూడా ప్రస్తుతం అతడు విచారణ ఎదుర్కొంటున్నాడు. కడలూరు , విల్లుపురం, కళ్లకురిచి జిల్లాల్లో ఒకే సమయంలో రెండు దొంగతనాల కేసులకు పాల్పడ్డాడని, లాభం కోసం ఒకరిని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులోనూ అతడిపై విచారణ జరగుతోంది.

లూథియానా కోర్టు పేలుళ్ల కుట్రదారు హర్‌ప్రీత్ సింగ్‌ అరెస్ట్....

కాగా.. తాజాగా కోర్టు విధించిన శిక్షకు సంబంధించిన వివరాలను ప్రాసిక్యూటర్ వెల్లడించారు. జి.కవిదాస్ విల్లుపురానికి  2019 ప్రారంభంలో చేరుకున్నాడు. అక్కడే జేసీబీతో పనులు తవ్వే పనులు చేసుకుంటూ నెలకు పైగా ఉన్నాడు. అయితే 2019 ఫిబ్రవరి 17వ తేదీన స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. దీంతో అతడిలో దుర్భుద్ధి కలికింది. అక్రమంగా ఇంట్లోకి చొరబడి ఆమెను అత్యాచారం చేశాడు. దుంగలతో ఆమెపై కిరాతకంగా దాడి చేశాడు. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. దీంతో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios