దారుణం: కూతురి స్నేహితురాలిని రేప్ చేసిన తండ్రి

Gurugram businessman held for raping daughter’s friend in Belaire home
Highlights

గురుగ్రామ్‌లో ఓ వ్యాపారి తన కూతురి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు  నిందితుడిపై కేసు నమోాదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గురుగ్రామ్: బాల్య స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిన  ఓ యువతిపై స్నేహితురాలి తండ్రి అత్యాచారం చేసిన ఘటన  గురుగ్రామ్‌లో చోటు చేసుకొంది.  ఈ ఘటనపై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గురుగ్రామ్‌లో నగరంలోని  డీఎల్ఎఫ్  5 ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కూతురు విదేశాల్లో చదువుతోంది. సెలవుల కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన సమయంలో తన బాల్య స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడేది. ఈ క్రమంలోనే  బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది.

విదేశాల్లో చదువుకొని స్వదేశానికి వచ్చిన తన చిన్న నాటి స్నేహితురాలిని చూసేందుకు వ్యాపారి ఇంటికి ఆ యువతి వెళ్లింది. భోజనం  చేసి స్నేహితురాలితో కలిసి ఆమె రూమ్‌లో పడుకొంది. 

అయితే  తెల్లవారుజామున ఆ యువతితో మాట్లాడాలని చెప్పి వ్యాపారి ఆమెను పక్క రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడి భార్య ఇంట్లో లేదు.  

బాధితురాలు  తన కుటుంబసభ్యులతో కలిసి  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
 

loader