హైదరాబాద్: కర్ణాటకలో  రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్  సమర్ధించుకొన్నారు.  చట్టాన్ని  తాను అమలు చేసినట్టుగా రమేష్‌ కుమార్ స్పష్టం చేశారు.

మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాను సోమవారం నాడు రమేష్ కుమార్ హైద్రాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో  మాట్లాడారు. 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు.

చట్టాలు ఎందుకు చేస్తాం... చేసిన చట్టాలను అమలు చేయాలి కదా... తాను చట్టాన్ని అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. స్పీకర్ గా తన బాధ్యతను నెరవేర్చినట్టుగా రమేష్ కుమార్ చెప్పారు. 

దేశంలో అందరూ కూడ  తన మాదిరిగానే చేయాలని కోరుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు. అయితే చట్టం తెలియక చేయడం లేదా... ధైర్యం లేక చేయడం లేదో తనకు తెలియదని రమేష్ కుమార్ చెప్పారు.

తప్పు చేస్తే శిక్షను అనుభవించాల్సిందేనని ఆయన చెప్పారు. చట్టాన్ని మాత్రమే తాను అమలు చేసినట్టుగా  ఆయన గుర్తు చేశారు. తాను సత్యసాయి భక్తుడినని.... తనలో సత్యసాయి ధైర్యం నింపాడని రమేష్ కుమార్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా

ఎంత కాలం ఉంటారో చూస్తాం: యడియూరప్పపై సిద్దూ

ప్రారంభమైన అసెంబ్లీ: మరికొద్దిసేపట్లో యడియూరప్ప బలపరీక్ష

యడియూరప్ప బలపరీక్ష: విప్ జారీ చేసిన బీజేపీ

కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్