బెంగుళూరు: అధికారంలో మీరు ఎంతకాలం ఉంటారో మీకే తెలియదని సీఎం యడియూరప్పను  మాజీ సీఎం సిద్దరామయ్య సెటైర్లు వేశారు.

కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాడు సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై కాంగ్రెస్ పక్ష నేత మాజీ సీఎం సిద్దరామయ్య ప్రసంగించారు.

ఏనాడూ కూడ ప్రజల తీర్పు మేరకు యడియూరప్ప సీఎం కాలేదని సిద్దరామయ్య విమర్శించారు. 2008, 2018 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును సిద్దరామయ్య ప్రస్తావించారు. 

యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో  సభలో 222 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి 112 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి కేవలం 105 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇది ప్రజల తీర్పా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అందరిని కలుపుకుపోతామని సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను  ఆయన స్వాగతించారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని సిద్దరామయ్య సూచించారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని సిద్దరామయ్య గుర్తు చేశారు. కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో నాలుగు రోజుల పాటు చర్చించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ విషయమై తాను లేవనెత్తబోనన్నారు. యడియూరప్ప సీఎంగా ఎన్నికైన పరిస్థితులపైనే మాట్లాడుతానని సిద్దరామయ్య చెప్పారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాయమని సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం తాను, కుమారస్వామి కూడ శక్తివంచన లేకుండా ప్రయత్నించిన విషయాన్ని సిద్దరామయ్య గుర్తు చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రాం ను అమలు చేసేందుకు పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

 

ప్రారంభమైన అసెంబ్లీ: మరికొద్దిసేపట్లో యడియూరప్ప బలపరీక్ష

యడియూరప్ప బలపరీక్ష: విప్ జారీ చేసిన బీజేపీ

కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్