Asianet News TeluguAsianet News Telugu

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 104, ఎవరికీ లాభం?

యడియూరప్ప విశ్వాస పరీక్షకు ముందు రోజే 14 మంది ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు పడింది. యడియూరప్ప సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొనే అవకాశం ఉంది.

Advantage BJP As 14 Karnataka Rebels Disqualified Day Before Trust Vote
Author
Bangalore, First Published Jul 28, 2019, 1:29 PM IST

బెంగుళూరు: 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్  వేటు వేయడం బీజేపీకి  రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  సోమవారం నాడు యడియూరప్ప అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

11 మంది కాంగ్రెస్ రెబెల్స్, 3 జేడీ(ఎస్) ఎమ్మెల్యేలపై ఆదివారం నాడు స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారు. మూడు రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.దీంతో 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటేశారు.

17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడంతో కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 104.జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమికి 99 సభ్యుల బలం ఉంది.

అనర్హతకు గురైన ఎమ్మెల్యేలలో కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు చెందిన వారే ఉన్నారు. వీరంతా కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తివాదులుగా ముద్రపడ్డారు. ముంబైలో క్యాంప్ వేశారు.

అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. మరో ఇండిపెండెంట్ సభ్యుడు కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ బలం 106కు చేరింది. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం బీజేపీకి కలిసివచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు సోమవారం నాడు అసెంబ్లీలోకి అనుమతించబోమని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. యడియూరప్ప  సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత  సోమవారం నాడు తొలిసారిగా అడుగుపెట్టనున్నారు.

కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ తీరుపై బీజేపీ విమర్శలు గుప్పించింది. యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత స్పీకర్ ను మారుస్తారా అనే ప్రచారం సాగింది. ఈ తరుణంలో స్పీకర్ తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై హోటల్ లో చాలా రోజుల పాటు ఉన్నారు. విశ్వాస పరీక్షకు కూడ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. స్పీకర్ నిర్ణయంపై  ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు  సోమవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్

 

Follow Us:
Download App:
  • android
  • ios