బెంగుళూరు:కర్ణాటక సీఎం యడియూరప్ప సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు.ఈ నెల 26వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొంటానని  కర్ణాటక సీఎం యడియూరప్ప ధీమాను వ్యక్తం చేశారు. ఆదివారం నాడు 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేశారు. అంతకుముందే మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. దీంతో 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు.

వందశాతం అసెంబ్లీలో తాను బలాన్ని నిరూపించుకొంటానని సీఎం యడియూరప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ ను మినహాయిస్తే కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 224. రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు పడడంతో సభ్యుల సంఖ్య207 కు చేరుకొంది. 

మ్యాజిక్ ఫిగర్ 104.అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ బలం అసెంబ్లీలో 106కుచేరింది.

కాంగ్రెస్ కు చెందిన 11 మంది, జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆదివారం నాడు అనర్హత వేటు వేశారు. అనర్హత గురైన ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులే ఉన్నారు.

సంబంధిత వార్తలు

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్