కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్  సోమవారం నాడు రాజీనామా చేశారు.అసెంబ్లీలోనే తన రాజీనామా లేఖను స్పీకర్ చదివి విన్పించారు.

కర్ణాటక అసెంబ్లీలోనే స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి విశ్వాస పరీక్ష సమయంలో  స్పీకర్ గా ఉన్న రమేష్ కుమార్ తీరుపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కుమారస్వామికి అనుకూలంగా స్పీకర్ రమేష్ కుమార్ వ్యవహరించారని స్పీకర్ రమేష్ కుమార్ పై విమర్శలు చేసింది బీజేపీ.

ఈ విమర్శలపై అసెంబ్లీలోనే స్పీకర్ రమేష్ కుమార్ తన వివరణ ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలోనే తన రాజీనామా లేఖను  జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నట్టుగా రమేష్  కుమార్ చెప్పారు. రాజీనామా లేఖను కూడ స్పీకర్ అసెంబ్లీలోనే చూపించారు.

సోమవారం నాడు అసెంబ్లీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను స్పీకర్ రమేష్ కుమార్ సభలోనే చదివి విన్పించారు. రాజీనామా లేఖను అసెంబ్లీ అధికారులకు అందించారు. ఆ తర్వాత సభా అధ్యక్ష స్థానం నుండి దిగి వెళ్లిపోయారు.

యడియూరప్ప సీఎంగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకొన్నారు. కొత్త స్పీకర్ ను యడియూరప్ప ప్రభుత్వం ఎన్నుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.ఈ తరుణంలో స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేశారు.

స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత ఆయన నేరుగా హైద్రాబాద్ కు బయలుదేరారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రమేష్ కుమార్ హైద్రాబాద్ కు బయలుదేరారు.

సంబంధిత వార్తలు

ఎంత కాలం ఉంటారో చూస్తాం: యడియూరప్పపై సిద్దూ

 

ప్రారంభమైన అసెంబ్లీ: మరికొద్దిసేపట్లో యడియూరప్ప బలపరీక్ష

యడియూరప్ప బలపరీక్ష: విప్ జారీ చేసిన బీజేపీ

కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్