బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ  సోమవారం నాడు ప్రారంభమైంది. ఇవాళ అసెంబ్లీలో యడియూరప్ప అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బలనిరూపణకు యడియూరప్ప సిద్దమయ్యారు. 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర రమేష్ కుమార్  అనర్హత వేటు వేశారు. దీంతో ప్రభుత్వం  ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 104 మంది అవసరం.

 

బీజేపీకి 105 మంది సభ్యులు అవసరం ఉంది. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు.కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు 99 మంది సభ్యులు ఉన్నారు.సోమవారం నాడు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే  సీఎం యడియూరప్ప బలనిరూపణకు సిద్దమయ్యారు. ఈ మేరకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.తనను ఎవరైతే వ్యతిరేకించారో వారిని తాను ప్రేమిస్తానని విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టిన సమయంలో యడియూరప్ప ప్రకటించారు. 

కర్ణాటక సీఎంగా అవకాశం కల్పిం,చిన ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు యడియూరప్ప ధన్యవాదాలు తెలిపారు. గతంలో సీఎంలుగా పనిచేసిన కుమారస్వామి, సిద్ద రామయ్యలు కూడ ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదన్నారు.తాను కూడ అదే విధానాన్ని కొనసాగిస్తానని యడియూరప్ప ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

యడియూరప్ప బలపరీక్ష: విప్ జారీ చేసిన బీజేపీ

కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్