Asianet News TeluguAsianet News Telugu

యడియూరప్ప బలపరీక్ష: విప్ జారీ చేసిన బీజేపీ

కర్ణాటక సీఎం యడియూరప్ప సోమవారం నాడు  బలపరీక్షకు సిద్దమయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 104కు తగ్గింది.
 

'Confident' Yediyurappa Arrives for Floor Test, Congress Leaders Go Into a Huddle
Author
Bangalore, First Published Jul 29, 2019, 10:43 AM IST

బెంగుళూరు: కర్ణాటక సీఎం యడియూరప్ప సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు.బల పరీక్ష కోసం కాంగ్రెస్,జేడీ(ఎస్)లు, బీజేపీలు వ్యూహా ప్రతి వ్యూహాల్లో ఉన్నాయి.

 

సోమవారం నాడు అసెంబ్లీ ప్రారంభానికి ముందు సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. మరో వైపు బెంగుళూరులోని ఓ హోటల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీ విప్ జారీ చేసింది. ఆదివారం నాడు 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.ప్రభుత్వ ఏర్పాటుకు  104 మంది ఎమ్మెల్యేలు అవసరం.  బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు.

 

కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 99 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. కుమారస్వామిపై అసంతృప్తిగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం ముంబై నుండి నేరుగా బెంగుళూరుకు వచ్చారు.మరోవైపు అసెంబ్లీలో బలపరీక్షను పురస్కరించుకొని సీఎం యడియూరప్ప బెంగుళూరులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సంబంధిత  వార్తలు

కర్ణాటక స్పీకర్ గా రమేష్ కుమార్ రాజీనామా?

నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు: మ్యాజిక్ ఫిగర్ 105, ఎవరికీ లాభం?

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్

Follow Us:
Download App:
  • android
  • ios