Asianet News TeluguAsianet News Telugu

షాక్: 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటేసిన స్పీకర్

కర్ణాటకలో 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీక్ర రమేష్ కుమార్ అనర్హత వేటేశారు. సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్షకు ఒక్క రోజు ముందే ఎమ్మెల్యేలపై వేటు పడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

karnataka speaker disqualifies 10 mlas under anti defection law
Author
Bangalore, First Published Jul 28, 2019, 11:59 AM IST

కర్ణాటక రాష్ట్రంలో 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు అనర్హత వేటేశారు. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటేసిన విషయం తెలిసిందే.

కర్ణాటక సీఎం యడియూరప్ప బలపరీక్ష నిర్వహించుకోవడానికి  ఒక్క రోజు ముందే రమేష్ కుమార్  రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వాేశారు. రెబెల్ ఎమ్మెల్యేలపై నాలుగేళ్ల పాటు అనర్హత వేటు వేశారు. 

 

కాంగ్రెస్ కు చెందిన 11, జేడీ(ఎస్) కు చెందిన 3, ఒక స్వతంత్ర అభ్యర్ధిపై కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్  వేటు వేశారు.కాంగ్రెస్ పార్టీ నుండి బస్వరాజ్, మునిరత్నం, సోమశేఖర్ , సుధాకర్ , శివరాం హెబ్బార్, శ్రీమంత్ పాటిల్‌పై స్పీకర్ అనర్హత వేటు వేశారు.

జేడీ(ఎస్) నుండి గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్‌పై వేటు పడనుంది. స్వతంత్ర అభ్యర్ధి శంకర్ పై అనర్హత వేటు పడింది.వేటు పడిన ఎమ్మెల్యేలను సోమవారం నాడు అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షకు అనుమతించబోమని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. వేటు పడిన వారిలో కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలే ఉన్నారు. కుమారస్వామి ప్రభుత్వం ఓటమికి రెబెల్ ఎమ్మెల్యేలే కారణం. 

17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు చేరింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 104 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీకి ప్రస్తుతం అసెంబ్లీలో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల కూడ  బీజేపీకి మద్దతుగా నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios